సినిమా వార్తలు

“దృశ్యం 3 రిలీజ్ ప్లాన్ గందరగోళం: ఎవరి వెర్షన్ ముందు?

క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఇండియన్ సినీమాను కొత్త లెవల్‌కి తీసుకెళ్లిన దృశ్యం ఫ్రాంచైజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా మొదలైన ఈ కథ, తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. అదే ఫార్మాట్‌లో దృశ్యం 2 కూడా దుమ్ములేపింది. ఇప్పుడు ఫ్యాన్స్‌ అంతా దృశ్యం 3 కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ… షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే రిలీజ్ ప్లాన్‌పై టీమ్ ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోయింది!

మలయాళంలో — మోహన్‌లాల్
తెలుగులో — వెంకటేశ్
హిందీలో — అజయ్ దేవగణ్

ముగ్గురు స్టార్ హీరోలతో దృశ్యం 3 వస్తుంది. అయితే ఏ వెర్షన్ ముందుగా విడుదల చేయాలి? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ.

మలయాళం మొదట వస్తే?

సీక్రెట్ రివీల్ అయిపోయి… తెలుగు & హిందీ ఆడియెన్స్‌కి థ్రిల్ తగ్గిపోతుంది.

మూడు వెర్షన్స్‌ ఒకేసారి రిలీజ్ చేస్తే?

బాక్సాఫీస్ షేర్ డివైడ్ అయ్యే అవకాశం… బిజినెస్‌కు రిస్క్.

దీంతో మేకర్స్ అటూ ఇటూ ఆలోచిస్తూ నిలిచిపోయారు.
తెలుగు, హిందీ నిర్మాతలు కూడా టెన్షన్‌లోనే — “మలయాళం ముందుంటే మన మార్కెట్ దెబ్బతింటుందేమో?” అన్న భయం.

షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయ్యేలోపు రిలీజ్ స్ట్రాటజీని ఫైనల్ చేయాలని ప్లాన్

ముందుగా ఏ భాషలో విడుదల అవుతుంది?
అన్నీ ఒకేసారి వస్తాయా?
లేదా కొత్త సర్ప్రైజ్ ప్లాన్ ఉందా?

సస్పెన్స్ ఇంకా అలాగే…
దృశ్యం 3 గేమ్ ఇప్పుడే మొదలైంది!

Similar Posts