సినిమా వార్తలు

ఓటీటీలో రిలీజ్… అయినా థియేటర్లలో సునామీ – కాంతారా తగ్గేదేలే!

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ “కాంతారా: చాప్టర్ 1” ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్రెండ్స్‌ ప్రకారం, సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సేల్స్ వర్షం కురుస్తూనే ఉంది!

రిఫోర్ట్స్‌ ప్రకారం, విడుదలై నాలుగు వారాలు అయినా కూడా థియేటర్లలో సినిమా కలెక్షన్స్‌ బలంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో భారీ సంఖ్యల్లో చూస్తున్నారని అంచనా. కారణం? హిందీ వెర్షన్‌ ఓటీటీకి రావడానికి ఇంకా టైమ్ ఉంది – ఇది థియేటర్ రన్‌ను బలపరుస్తోంది.

అయితే ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. హిందీ వెర్షన్ మాత్రం ఈ నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్ లో రానుంది.

దీపావళి రిలీజ్‌లు, అక్టోబర్‌లో వచ్చిన కొత్త సినిమాలు ఏవి కూడా కాంతారా ప్రభావాన్ని చెక్కు చెదరగొట్టలేకపోయాయి. అందుకే ఓటీటీ వచ్చింది… థియేటర్ క్రేజ్ తగ్గిందన్న మాట మాత్రం పక్కా తప్పే!

సోషియల్ మీడియాలో కామెంట్స్ చూస్తే – “ఓటీటీ రిలీస్‌ ఇంకా లేట్‌గా ఉండి ఉంటే, కాంతారా మరింత రన్ చేసేది” అని చాలామంది అంటున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ ఇదే
బలమైన కంటెంట్ ఉంటే థియేటర్‌కి ప్రజలు వస్తారన్న నిజం మళ్లీ నిరూపితమైందా? తర్వాతి రోజుల్లో ఫిల్మ్‌మేకర్లు 4-వారాల ఓటీటీ విండోను పెంచుతారా? అన్నదే ఆసక్తికర ప్రశ్న.

కాంతారాకు ఓటీటీ కూడా అడ్డుకాలేదు… ఈ కలెక్షన్స్ వర్షం ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే!

Similar Posts