
‘పరాశక్తి’ తెలుగు టీజర్ ! శివ కార్తికేయన్,శ్రీలీల ఫుల్ ఫైర్ మోడ్
తమిళంలో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన శివ కార్తికేయన్ – సుధా కొంగర కాంబో, ఇప్పుడు తెలుగులో కూడా భారీ క్రేజ్ ని సెట్ చేస్తోంది. ఆకాశమే నీ హద్దురాతో దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించిన సుధా కొంగర ఈసారి పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీతో వస్తుండటంతో, తెలుగు ఆడియన్స్‌లో పరాశక్తి ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
తెలుగు టీజర్ విడుదలయ్యింది… అది కూడా తమిళ టీజర్ వచ్చిన 9 నెలల తరువాత. కానీ డిలే ఉన్నా హైప్ మాత్రం డైరెక్ట్‌గా రోఫర్ మ్యాక్స్‌కు వెళ్లింది!
టీజర్లో సుడిగాలి: ‘సైన్యమై కదిలిరా!’ — శివ కార్తికేయన్ ఫుల్ ఫైర్!
శివ కార్తికేయన్ ఒక స్టూడెంట్ లీడర్‌గా పూర్తిగా ఫైర్ మోడ్‌లో కనిపించారు. “సైన్యమై కదిలిరా…” అనే డైలాగ్ టీజర్ మొత్తానికీ హైలైట్. జయం రవి మాత్రం ఈసారి నిజమైన క్రూరమైన విలన్ గా షాకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చాడు.
అథర్వ కీలక పాత్రలో, శ్రీలీల ఈ చిత్రంతో తమిళ ఎంట్రీ ఇస్తుంది — ఇది కూడా తెలుగు మీడియాలో పెద్ద బజ్. పీరియడ్ పాలిటికల్ డ్రామా టోన్ బాగా కనిపించిన టీజర్, సుధా కొంగర మార్క్ ఇంటెన్సిటీని నేరుగా గుర్తు చేస్తుంది.
టెక్నికల్ టీమ్ కూడా సాలిడ్
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్ — విజువల్స్ రా & గ్రిప్పింగ్.
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్ — ఈ మూవీ ఆయన 100వ సంగీత చిత్రం!
నిర్మాణం: డాన్ పిక్చర్స్ – ఆకాష్ బాస్కరన్
రిలీజ్: పొంగల్ కానుకగా జనవరి 14, 2026 వరల్డ్‌వైడ్
2026 సంక్రాంతి రేస్: పరాశక్తి vs టాలీవుడ్ బిగ్ లైనప్!
2026 సంక్రాంతి బాక్సాఫీస్ నిజంగా బాంబ్లే బాంబ్. PARASAKTHI తో పాటు భారీ రిలీజ్ లు ఇలా ఉన్నాయి:
టాలీవుడ్ నుంచి:
చిరంజీవి – మన శంకరవరప్రసాద్ గారు
ప్రభాస్ – ది రాజా సాబ్
రవితేజ – భర్త మహాశయులకు విజ్ఞప్తి
నవీన్ పోలిశెట్టి – అనగనగా ఒకరాజు
కొలీవుడ్ నుంచి:
దళపతి విజయ్ – జన నాయగన్
ఈ లైనప్ చూస్తే, 2026 సంక్రాంతి లిటరల్‌గా వార్ లెవెల్ బాక్సాఫీస్ బాటిల్!
