
అదితి రావు హైదరి పేరుతో వాట్సాప్ స్కామ్,సీరియస్ అలర్ట్!!
ప్రముఖ నటి అదితి రావు హైదరి పేరుతో WhatsAppలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారని బయటపడటంతో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు షాక్‌లోకి వెళ్లారు. ఆమె ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని, “ఫోటోషూట్ కోసం నేను మాట్లాడుతున్నా” అంటూ ఎవరో ఇండస్ట్రీ వ్యక్తులకు మెసేజ్‌లు పంపుతున్నారని అదితి వెల్లడించారు.
“ఆ నంబర్‌కి రిప్లై ఇస్తే పెద్ద సమస్య!” — అదితి వార్నింగ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పష్టమైన నోట్ షేర్ చేస్తూ ఆమె ఇలా అన్నారు:
“వాట్సాప్‌లో నా ఫోటో పెట్టుకుని నేనే అన్నట్టుగా మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. అది నేను కాదు. నేను వ్యక్తిగత నంబర్ నుంచి ఎవరినీ సంప్రదించను. నా పనులన్నీ నా అధికారిక టీమ్ ద్వారానే జరుగుతాయి.”
అలాగే “దయచేసి ఆ నంబర్‌తో ఎవరూ మాట్లాడొద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీమ్‌కు తెలియజేయండి. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అదితి తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు, సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
కెరీర్ విషయానికి వస్తే… ఇటీవలి కాలంలో Netflix సూపర్ హిట్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ తో అదితి మరోసారి వెలుగులోకి వచ్చారు. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
అదే సమయంలో, తెలంగాణ వనపర్తి రాజవంశానికి చెందిన అదితి, ఆ ప్రాంతపు చీరల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇలాంటి హైప్ లో ఉండగానే WhatsAppలో ‘ఫేక్ అదితి’ ఎంట్రీ ఇండస్ట్రీలో కంగారు రేపుతోంది.
ఇండస్ట్రీ ఆర్టిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్!
మీ WhatsAppలోకి వచ్చిన అదితి మెసేజ్… నిజమేనా?
మూడు సెకన్లు ఆగి చెక్ చేయండి!
