
చిరంజీవి రెమ్యూనరేషన్ ఫిగర్ చూసి షాక్ అవుతున్న టాలీవుడ్!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ & ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్‌తో సినిమా చుట్టూ క్రేజ్ మరింత పెరిగిపోయింది. సంక్రాంతి 2026కి ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధమవుతుండగా, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన చిరు రెమ్యూనరేషన్ వివరాలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి!
మెగాస్టార్ రేటు వినగానే షాక్ అవ్వాల్సిందే!
విశ్వసనీయ సమాచారం ప్రకారం — చిరంజీవి ఈ సినిమాకు గాను రూ.72 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అంతే కాదు, ఈ ప్రాజెక్ట్‌లో ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల కూడా భాగస్వామి అవుతున్నారు. నిర్మాతగా ఆమెకు సినిమా లాభాల్లో 50 శాతం షేర్ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఫ్యామిలీగా “శంకరవరప్రసాద్ గారు” నుంచి మంచి ప్రాఫిట్ గ్యారెంటీ అన్నమాట.
బిజినెస్ విషయానికి వస్తే.. “మన శంకర వరప్రసాద్ గారు” డీల్స్ అన్నీ దాదాపు క్లోజ్ అయ్యాయి. షూట్ డిసెంబర్ మధ్యలో పూర్తవుతుందని, తర్వాత ప్రమోషన్స్ బిగినవుతాయని సమాచారం. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ బజ్:
“చిరు అంటే బాక్సాఫీస్ మంత్రం… ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో తిరిగి అదే జోష్!”
