సినిమా వార్తలు

‘అఖండ 2’ ఇన్‌సైడ్ టాక్ షాకింగ్!!

డిసెంబర్ 5 విడుదల కానున్న అఖండ 2 పై టాలీవుడ్‌లో అసలైన హీట్ ఇప్పుడే మొదలైంది. డిసెంబర్ 4 రాత్రే భారీ పెయిడ్ ప్రీమియర్స్ కు రంగం సిద్దైమైంది. కూకట్‌పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఇప్పటికే జనసంద్రం. థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ + యాక్షన్ ట్రైలర్ + ఫుల్ ఆల్బమ్ – ఒక్కరోజే హైప్‌ను టాప్ గేర్‌లోకి తీసుకెళ్లే ప్లాన్! ఈ క్రమంలో అఖండ 2 ఇన్‌సైడ్ టాక్ బయిటకు వచ్చింది.

ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం,

ఇంటర్వల్ బ్లాక్ నేరుగా గూస్‌బంప్స్ గ్యారెంటీ!
సెటప్, బిల్డప్, యాక్షన్ డిజైన్ – బోయపాటి మార్క్ మాక్సిమమ్.
బాలయ్యకి ఇప్పటివరకు వచ్చిన ఇంటర్వల్స్ లో ఇది టాప్ 1 అంటున్నారు టీమ్‌లోని వాళ్లు!

“సింహ”, “లెజెండ్”, “అఖండ” – ఈ కాంబినేషన్ ఇచ్చిన ప్రతి ఇంటర్వల్ బ్లాక్ అగ్నిపర్వతమే. ఇప్పుడు అఖండ 2 లో… “మరిన్ని కిర్రాక్ మోమెంట్స్ రెడీ అవ్వండి” అంటున్నారు ఇన్‌సైడర్స్.

సెకండ్ హాఫ్ గురించి మాత్రం మాటలే లేవు – నాన్-స్టాప్ యాక్షన్!

వర్డ్ ఏమిటంటే…

దాదాపు మొత్తం సెకండాఫ్ మొత్తం యాక్షన్‌తోనే నిండిపోతుంది. ప్రతి ఫైట్‌కు ముందు మ్యాసివ్ లీడ్ సీన్స్. బోయపాటి – బాలయ్య కాంబో ఎస్టాబ్లిష్ చేసిన గోల్డ్ ఫార్ములాను మళ్ళీ ఫాలో అవుతున్నారు ఇవి పనిచేస్తే ఈ ఏడాది నంబర్ 1 బ్లాక్‌బస్టర్ ఖాయం అంటోంది ట్రేడ్ .

ఎమోషన్ + యాక్షన్ = అఖండ 2 అనూహ్యమైన కలెక్షన్లు కొట్టొచ్చు!

ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో బోయపాటి బాగా అర్థం చేసుకున్నాడని టాక్. డ్రామా, ఎమోషన్, డైలాగ్స్ – ఆ తర్వాత కేకలు వేయించే యాక్షన్… అన్నీ సరిగ్గా క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్‌ మీద అనూహ్యమైన రికార్డులు నమోదుకావచ్చని ట్రేడ్ అంచనా.

“సింహ”, “లెజెండ్”, “అఖండ” తర్వాత… ఈ కాంబో నాలుగోసారి చరిత్ర రాయబోతోందా?

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఇప్పటివరకు ఒక్కసారైనా ఫ్లాప్ కాలేదు. ఈసారి అయితే పెద్ద స్కేల్, పెద్ద స్టేజింగ్, భారీ హైప్…అందుకే అఖండ 2 మీద అంచనాలు స్కై లెవల్!

Similar Posts