
అజిత్ బైక్ రేస్ సీక్రెట్స్…ఇప్పుడు ఓటిటిలో !
తమిళ హీరో అజిత్ అంటే సినిమాల్లో మాస్ హీరో మాత్రమే కాదు, రేసింగ్ ట్రాక్ మీద కనిపించే రౌద్రరూపం కూడా. ఇప్పుడు ఆ పాషన్‌నే ప్రపంచానికి చూపించేందుకు ఒక పెద్ద ప్లాన్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో 30-40% టైమ్ మాత్రమే ఆయన జీవితం … మిగతా అంతా రేసింగ్! ఈ ఫోకస్ వెనుక ఏముంది? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఈ మొత్తం కథను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి ఒక డాక్యుమెంటరీ సిద్ధమవుతోంది.
ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు A. L. విజయ్ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో రేసింగ్ ట్రాక్ నుంచి, వ్యక్తిగత ట్రైనింగ్ వరకు — అన్నీ నిజమైనవి, రియల్ ఫుటేజ్ తో! మరి థియేటర్లలో కాదు… డైరెక్ట్ OTT రీలీజ్. వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అజిత్ రేసింగ్‌కి ఎందుకు అంత ప్రేమ? డేంజర్‌లోకి వెళ్లి ఎందుకు రిస్క్ తీసుకుంటాడు? ఇవన్నీ స్క్రీన్ మీద చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.
అంతే కాదు… సినిమా ఫ్రంట్‌లో కూడా సైలెంట్‌గా ప్లాన్స్ జరుగుతున్నాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యింది. ప్రొడ్యూసర్లతో చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉండగా, సరైన నిర్మాత ఓకే చెబుతే, 2026 ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రేసింగ్ లో స్పీడ్… సినిమాల్లో సర్ప్రైజ్… అజిత్ ఇద్దరిలోనూ ఫుల్ గేర్ లోకే రెడీ!
