సినిమా వార్తలు

అనుదీప్ ‘ఫంకీ’… రిలీజ్ ప్లాన్ షాకింగ్ ట్విస్ట్!

విష్వక్ సేన్ సినిమా అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలు సహజం. ఇప్పుడు ఆ అంచనాలనే డబుల్ చేస్తూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ రిలీజ్ ప్లాన్స్‌లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. మొదట వేసవి కానుకగా థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు ప్రేమికుల రోజు బరిలోకి దిగుతోంది.

నవ్వుల్ని లక్ష్యంగా అనుదీప్–విష్వక్ కాంబో

‘జాతిరత్నాలు’తో తన కామెడీ టైమింగ్‌ను ప్రూవ్ చేసిన దర్శకుడు కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఒక్క లక్ష్యంతో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యనిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కయాదు నటిస్తుండగా, ఈ కథలో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండనుందని టాక్.

ఏప్రిల్ నుంచి ఫిబ్రవరికి… రిలీజ్ డేట్ మార్పు ఎందుకు?

మొదట ఏప్రిల్ 3, 2026న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు ఆ ప్లాన్‌ను మార్చేశారు. నెలన్నర ముందుగానే సినిమాను ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రేమికుల రోజు వీకెండ్‌ని టార్గెట్ చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

దర్శకుడిగా విష్వక్… నిర్మాతగా కయాదు!

ఈ సినిమాలో విష్వక్ సేన్ ఓ సినిమా దర్శకుడి పాత్రలోకనిపించనుండగా, కయాదు లోహర్ నిర్మాత పాత్రలోనటించడం మరో హైలైట్‌గా మారింది. సినిమాకి సంగీతం అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో తన ఎనర్జిటిక్ ట్యూన్స్‌తో ఫంకీ వైబ్‌ను మరింత పెంచనున్నారు.

ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో ఈ ఫంకీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి!

Similar Posts