సినిమా వార్తలు

బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున ‘ధురంధర్’… ఓటిటి రిలీజ్ డేట్

బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆగకుండా పరుగులు తీస్తుంటే… అదే సమయంలో ఓటిటి రిలీజ్ కోసం ఫ్యాన్స్ క్యాలెండర్ చూస్తుంటే… అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ సినిమా రేంజ్ ఏంటో. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ ఇప్పుడు అదే దశలో ఉంది. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తూనే, “ఓటిటిలో ఎప్పుడు వస్తుంది?” అనే ప్రశ్నను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయిస్తోంది. భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్‌పై ఇప్పుడు ఇంట్రెస్ట్ పీక్స్‌కు చేరింది.

ధురంధర్ హవా ఎందుకు ఇంత భారీగా ఉంది?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌ విడుదలకు ముందే బలమైన బజ్‌ను క్రియేట్ చేసింది. దేశభక్తి నేపథ్యంతో, పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలను నిర్వీర్యం చేసే సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. ఓ ఖైదీని ఏజెంట్‌గా మార్చి శత్రుదేశంలోకి పంపే కాన్సెప్ట్ సినిమాకు మేజర్ హైలైట్‌గా మారింది.

రణవీర్ సింగ్ ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్, క్రిటిక్స్ ఏకగ్రీవంగా చెబుతున్నారు. అక్షయ్ ఖన్నా విలన్‌గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించగా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి అనుభవజ్ఞుల నటన సినిమాకు మరింత బలం ఇచ్చింది. సారా అర్జున్, సౌమ్య టాండన్ పాత్రలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర రూ. 530 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించి, ‘ధురంధర్’ మేకర్స్‌కు భారీ మనీ స్పిన్నర్‌గా మారింది. జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ వంటి అంతర్జాతీయ సినిమాలను కూడా కొన్ని మార్కెట్లలో వెనక్కి నెట్టడం ఈ సినిమా రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

ఇప్పుడిక అసలు హాట్ టాపిక్… ఓటిటి రిలీజ్ . ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, జనవరి 30, 2026 నుంచి ‘ధురంధర్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తోంది.

థియేటర్లలో ఇంకా జోరు తగ్గకపోయినా… ఓటిటిలో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మళ్లీ మళ్లీ చూసే సినిమా అన్న ట్యాగ్ ఇప్పటికే ‘ధురంధర్’ సొంతం చేసుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం, రణవీర్ సింగ్ ఎనర్జీ, స్ట్రాంగ్ క్యాస్టింగ్ కలిసి ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… థియేటర్లలో రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’, ఓటిటిలో కూడా అదే స్థాయి సంచలనం సృష్టిస్తుందా? జనవరి చివరి వరకూ… ఫ్యాన్స్ చూపు పూర్తిగా నెట్‌ఫ్లిక్స్ మీదే.

Similar Posts