‘మండాడి’ (Mandadi) సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై సముద్ర తీరంలో పడవపై కొన్ని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టెక్నీషియన్స్ ఉన్న పడవ బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు మునిగిపోగా.. కెమెరాలు నీటిలో పడిపోయాయి. సముద్రంలో పడిపోయిన ఇద్దరిని సినిమా యూనిట్‌ రక్షించింది. కెమెరాలు, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి. రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం.. మందాడి. ఈ సినిమా ద్వారా తమిళంలో అరంగేట్రం చేస్తోన్నాడు సుహాస్. తమిళ కమేడియన్ సూరి హీరో. మత్తిమారన్ పుహళేంది దర్శకుడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇందులో కరడుగట్టిన విలన్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడు సుహాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడు చురుగ్గా సాగుతోంది. రామనాథపురం జిల్లా తీర ప్రాంత గ్రామం తొండి సమీపంలో సముద్రంలో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ సాగుతోంది.

ద్విభాషా చిత్రంగా మందాడి ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆర్‌ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తోన్న మూవీ ఇది. సూరి, సుహాస్‌తో పాటు సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచానా నమిదాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from