30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. విశ్వక్సేన్ ‘లైలా’ సినిమా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు తమకు ఆపాదించుకుని, తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైసీపీ శ్రేణులు గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్స్ పెడుతూ వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా వెళ్లి పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో, ఫోన్లు, మేసేజులతో అసభ్యంగా దూషిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పృథ్వీ మాట్లాడుతూ.. తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని చెప్పాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదని, అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడనని తెలిపాడు. కానీ అది వైసీపీకి ఆపాదించుకుని ప్రచారం చేసుకున్నారని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

గత రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్రంగా వేధిస్తున్నారని, తన ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ల్లో పెట్టి మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 1800 కాల్స్ చేయించారని, తన భార్యను , తల్లిని , పిల్లలను తిట్టించారని.. వైసీపీ సోషల్ మీడియా వేధింపుల వల్ల తాను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని పృథ్వీ చెప్పాడు.

అనిల్ అనే పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. ఏపీ హోంమంత్రిని కూడా కలిసి త్వరలో ఫిర్యాదు చేస్తానని, వేధించిన వాళ్లపై కోటి రూపాయల పరువునష్ట దావా వేస్తానని నటుడు పృథ్వీ చెప్పాడు.

అసలేం జరిగింది

యంగ్ హీరో విశ్వక్ సేన హీరోగా తెరకెక్కిన చిత్రం లైలా. ఈ మూవీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ యాక్ట్ చేశారు. 2025, ఫిబ్రవరి 14న విడుదల లైలా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మూవీ యానిట్ ఆదివారం హైదరాబాద్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో పృథ్వీ ‘11 మేకలు, 150 మేకలు’’ అంటూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. పరోక్షంగా వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ కామెంట్స్ చేశాడని.. ఆ పార్టీ అభిమానులు భగ్గుమన్నారు.

,
You may also like
Latest Posts from