
రాజమౌళిని చూసి కమల్ కు ఊపొచ్చిందా… ఇప్పుడేం చెయ్యబోతున్నాడో తెలుసా?
తమిళ స్టార్ కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే ప్రకటించిన మహత్తర ప్రాజెక్ట్ ‘మరుదనాయగమ్’ గురించి తెలుసు కదా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ విజన్‌తో 1996లో స్టార్ట్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్నేళ్లుగా అభిమానులు, సినిమా ప్రేమికులు – “ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందా?” అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
కానీ ఇప్పుడు… కమల్ హాసన్ స్వయంగా ఒక పెద్ద క్లూ ఇచ్చాడు!
“ఇది మళ్లీ చేస్తాను… మోడ్రన్ టెక్నాలజీతో పూర్తి చేయగలను”
కమల్ హాసన్ తాజాగా మీడియాతో అన్నారు – “ ‘మరుదనాయగమ్’ మళ్లీ మొదలుపెట్టే ప్లాన్ ఉంది. ఆధునిక టెక్నాలజీతో ఇప్పటికైనా ఈ సినిమాను పూర్తి చేయగలుగుతాను” అని.
ఇది చెప్పగానే సోషల్ మీడియాలో హల్‌చల్!
వారణాసి గ్లింప్స్ తర్వాత ‘మరుదనాయగమ్’ వీడియో వైరల్
It's Not 2025
It's in 1997🔥Without CG,The One & Only #Marudhanayagam.#KamalHaasan Sir is Always Ahead of Technology💯,While Others Follow Trends.
He creates Them,Visionary at its Peak🥵.
Every Decade,New Tech Rises,But One Thing Stays Constant,@ikamalhaasan Vision.#Varanasi pic.twitter.com/OJoUnjmdCk— KarthickHaasan (@karthickhaasan7) November 16, 2025
‘వారణాసి’ గ్లింప్స్ విడుదలైన వెంటనే… పాత ‘మరుదనాయగమ్’ సెట్ నుండి ఒక చిన్న వీడియో హఠాత్తుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం స్టార్టయ్యింది. ఆ వీడియో అదిరిపోయే విజువల్ క్వాలిటీతో ఉండటంతో, ఫ్యాన్స్ మళ్లీ ఆ ప్రాజెక్ట్ పై హైప్ పెంచేశారు.
దీనిపై స్పందించిన కమల్ హాసన్ – “అవకాశం వస్తే పూర్తి చేస్తాను” అని క్లారిటీ ఇచ్చాడు.
అప్పట్లో 50 కోట్ల బడ్జెట్… ఇప్పుడు ఎంత అవుతుందో?
1996లోనే రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఏడాదిన్నర పాటు షూటింగ్ కూడా జరగింది. కానీ ఫైనాన్షియల్ సమస్యల వల్ల ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టాల్సివచ్చింది.

ఇప్పుడేమో…
CGI, వర్చువల్ ప్రొడక్షన్, AI–driven VFXతో ఈ సినిమా మరో లెవెల్‌లో తయారయ్యే అవకాశం ఉందని అంటున్నారు సినీ వర్గాలు.
కమల్ ఈ విషయం గురించి చెబుతూ – ‘‘‘మరుదనాయగమ్’వంటి చిత్రం చేయడానికి డబ్బులు మాత్రమే కాదు.. చాలా సమకూరాలి. ముఖ్యంగా పంపిణీరంగం నుంచి సహకారం కావాలి. ఈ చిత్రాన్ని తమిళ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నా. పంపిణీ సరిగ్గా జరిగితేనే సినిమాకి న్యాయం జరుగుతుంది. అందుకని పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. జస్ట్ అలా అమ్మేసి, ఇలా హ్యాపీగా ఇంటికెళ్లిపోయేంత తేలికైన చిత్రం కాదిది. యూఎస్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మంచి వేదిక కావాలి నాకు. ఫాక్స్, వయొకామ్ వంటి సంస్థలు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికి 30 నిమిషాల చిత్రాన్ని తీశాను. ఇంకా రెండు గంటల సినిమా తీయాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మొదలుపెడతా’’ అన్నారు.
