‘కూలీ’ సినిమాతో మరోసారి తన క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదన్న విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నిరూపించబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న రిలీజ్‌కు రెడీ అవుతుండగా… ఫ్యాన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ టాప్ గేర్‌లో ఉన్నాయి. నాగార్జున విలన్‌గా, ఆమీర్ ఖాన్ స్పెషల్ రోల్‌లో, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి కాంబినేషన్లతో ఇది ఓ పాన్ ఇండియా ఫెస్ట్‌గా మారబోతోంది.
అయితే కూలీ తర్వాత రజనీ ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే ‘జైలర్ 2’ కోసం నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి షూటింగ్ చేస్తున్న రజినీ… తాజా సమాచారం ప్రకారం, తన తదుపరి సినిమాకు ‘అన్నాట్తే’ ఫేమ్ శివ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
అన్నాట్తే (పెద్దన్న) → ఫ్లాప్, కంగువా → డిజాస్టర్: మళ్లీ అదే డైరెక్టర్ వద్దంటే?
శివ-రజనీ కాంబినేషన్లో వచ్చిన ‘అన్నాట్తే’ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై, చివరికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కమర్షియల్ ఫార్ములాలో మునిగిపోయిన ఆ సినిమా రజినీ ఇమేజ్‌కే డ్యామేజ్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అదే డైరెక్టర్ శివ, ఆఖరిసారి సూర్యతో చేసిన భారీ ప్రాజెక్ట్ ‘కంగువా’ కూడా ఆడియెన్స్‌ని ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఆ సినిమాకి కలెక్షన్ల పరంగా మాత్రం దారుణంగా నష్టాలే మిగిలాయి.
ఈ నేపథ్యంలో… రజినీకాంత్ మళ్లీ అదే డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వడం నిజంగా అవసరమా? రజనీ ఇమేజ్‌ను రీసెట్ చేయాలంటే, మాస్ క్రేజ్‌ను మళ్ళీ రెచ్చగొట్టాలంటే అనుభవం, ఎనర్జీ ఉన్న డైరెక్టర్ అవసరం అన్నదే ఫ్యాన్స్ భావన.
అవసరమా ఇది రిస్క్..?
సినిమా అనేది రిస్క్ ఉన్న రంగమే అయినా, గత ట్రాక్ రికార్డ్ చూస్తే… శివ దర్శకత్వంలో మళ్లీ ప్రయోగం చేయడం ఫ్యాన్స్‌కు జీర్ణించుకునే అంశం కాదు. “ఇప్పుడు కూలీ లాంటి మాస్ మూవీ తర్వాత… రజనీకి అంతే పవర్‌ఫుల్, స్టైలిష్ డైరెక్టర్ అవసరం. మరో ఫ్లాప్ భరించలేం” అని సోషల్ మీడియాలో హార్డ్‌కోర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకే డైరెక్టర్స్ ఉన్నారు?
లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, విక్రమ్ కుమార్, వేట్రిమారన్ లాంటి కంటెంట్ ప్లస్ కమర్షియల్ బ్యాలెన్స్ చేయగల ఫిల్మ్ మేకర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ… శివ కోసమే మరో ఛాన్స్ ఇవ్వడమేంటని పెద్ద చర్చ మొదలైపోయింది.