ఇప్పుడు మైథలాజికల్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతీ పెద్ద హీరో, ప్రతీ పెద్ద దర్శకుడు ఈ జానర్ వైపు మొగ్గుచూపుతున్నారు. అదే ట్రెండ్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఓ భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా కోసం సిద్ధమవుతున్నారు.
‘సూపర్ హీరో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే– దీనిని టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మడైరెక్ట్ చేయబోతున్నారు. రవితేజ హీరోగా చేసిన వీర, ఖిలాడీ వంటి సినిమాలు చేసిన ఆయన, ఈ సారి మల్టీ లాంగ్వేంజ్ బడ్జెట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా తీస్తున్నారు.
సినిమా గురించి ఒక విశ్వసనీయ వర్గం చెప్పిన వివరాల ప్రకారం– ఈ కథలో భారతీయులు అత్యంత భక్తితో పూజించే దేవుడి పాత్రని అజయ్ దేవగన్ పోషించబోతున్నాడు. భూత, భవిష్యత్తు, వర్తమానం కలిసే విధంగా మైథలజీని ఆధునిక స్టైల్‌లో ప్రెజెంట్ చేస్తూ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోంది. దీనికి తగ్గట్టే భారీ స్థాయిలో VFX విజువల్స్ఉండబోతున్నాయి.
‘సూపర్ హీరో’ని కొన్నేరు సత్యనారాయణ నిర్మిస్తుండగా, బాలీవుడ్ నిర్మాత వినోద్ భాను శాలి కూడా ప్రొడక్షన్‌లో భాగమవుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో ఒకేసారి విడుదల చేసి పాన్ ఇండియా లెవెల్‌లోరిలీజ్ చేయబోతున్నారు.
ఇదే సమయంలో రమేష్ వర్మ షెడ్యూల్ కూడా బాగా బిజీగా ఉంది. 2025లో అతను మరికొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ చేయబోతుండగా, త్వరలో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్తో కూడానూ ఓ సినిమాని అనౌన్స్ చేయనున్నాడు.
మొత్తానికి, మైథలాజికల్ సినిమాల ట్రెండ్‌కు తగినట్టే, అజయ్ దేవగన్ – రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సూపర్ హీరో’పై భారీ అంచనాలు మొదలయ్యాయి.