తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి స్వల్ప గాయమైందని, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు నటుడి టీమ్ జాతీయ మీడియాకు తెలిపింది. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
అజిత్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని అభిమానులకు సూచించింది. పద్మభూషణ్ అవార్డు స్వీకరణ అనంతరం అజిత్ కుటుంబం దిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు మంగళవారం రాత్రి చేరుకుంది.
ఆ సమయంలోనే భారీ సంఖ్యలో అభిమానులు నటుడివైపు దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలోనే అజిత్ కాలికి స్వల్ప గాయమైనట్టు టీమ్ వివరించింది.