సినిమా వార్తలు

‘అఖండ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు… మీడియా ఊహాగానాలు మరో లెవెల్‌కి చేరాయి. కానీ అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ పూర్తిగా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.

EROS ఇష్యూ – ఇప్పుడు నిర్ణయం వారి చేతుల్లో!

పాత బాకీల విషయంలో EROS International స్ట్రాంగ్ గా స్టాండ్‌లో ఉంది. ఎలాంటి కంప్రమైజ్ లేదు అన్నట్టే వ్యవహరిస్తోంది. ఈరోజు కోర్టు విచారణలో ఏ నిర్ణయం వస్తుందో — అదే ‘అఖండ 2’ భవితవ్యం.

ప్రొడ్యూసర్లు డ్యూస్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్స్ కూడా స్పష్టంగా సూచించారు:
“ముందు EROS ఇష్యూ క్లియర్ చేయండి… తర్వాతే రిలీజ్ డేట్ నిర్ణయించండి.”

ఇలా అయితే, EROS సమస్య ముగిసిన వెంటనే పెద్ద ఆటంకాలు ఉండవని మేకర్స్ చెబుతున్నారు.

మధ్యలో ప్రచారం అయ్యింది — “డిస్ట్రిబ్యూటర్లు కలసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు” అని. కానీ ఇది నిజం కాదు.

దిల్ రాజు తనే డిస్ట్రిబ్యూటర్లతో సమన్వయం చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి ఇద్దరూ ముందుకొచ్చి తమ రెమ్యునరేషన్ తగ్గించి, ప్రొడ్యూసర్లకి సపోర్ట్ ఇవ్వడానికి అంగీకరించారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో డిసెంబర్ 12 అనే రిలీజ్ డేట్ వైరల్ అవుతోంది.

కానీ మేకర్స్ క్లియర్:

“సమస్య పరిష్కారం అయ్యాకే డేట్ ఫిక్స్ చేస్తాం.”

నెట్‌ఫ్లిక్స్ క్రిస్మస్ సజెషన్ – ఇప్పుడు నిర్ణయం 48 గంటల్లో!

Netflix అయితే మరో ఆప్షన్ ఇచ్చింది — “క్రిస్మస్ రిలీజ్ బెస్ట్!” అని సూచించింది. ఇప్పుడు థియేటర్ అవైలబిలిటీ, లీగల్ సెటిల్‌మెంట్ – రెండు కలిసి చూసి నిర్ణయం తీసుకుంటారు.

ప్రస్తుతం ఫోకస్ ఒక్కటే:

EROS లీగల్ క్లియరన్స్. అన్ని విషయాలు రేపు–ఎల్లుండి స్పష్టమవుతాయని ఇండస్ట్రీలో మాట. ఫ్యాన్స్ ఒక్కటే కోరుతున్నారు:
“రిలీజ్ అయితే చాలు… మిగతాదంతా థియేటర్‌లో తాండవం!”

Similar Posts