సరైనా హిట్స్ లేక కెరీర్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది.
ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. కేసరి సీక్వెల్‌గా కేసరి 2ను తీసుకువచ్చాడు. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరుఫున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో కనిపించాడు అక్షయ్. అక్షయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ వార్తలొస్తున్నాయి. 2025లో ఈ రెండు చిత్రాలతో, రాబోయే సంవత్సరంలో అతని గ్రాఫ్ మెరుగుపడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అతని నెక్ట్స్ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైనర్. హౌస్‌ఫుల్ 5 చిత్రం జూన్ 6, 2025న విడుదల కానుంది. ఇది ఫ్రాంచైజ్ రీకాల్ అంశం కాబట్టి సక్సెస్ అయ్యే అవకాసం చాలా ఎక్కువ. హౌస్‌ఫుల్ 5 తర్వాత సినిమా కూడా సూపర్ హాట్ ఫ్రాంచైజీ జాలీ ఎల్‌ఎల్‌బిలో భాగం అవుతుంది. జాలీ ఎల్‌ఎల్‌బి 3 అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో భాక్సాఫీస్ దగ్గర రెట్టింపు ఇంపాక్ట్ చూపుతుంది.
ఇది కామెడీ సినిమా, సోషల్ మెసేడ్ కూడా కలిగి ఉంది. హౌస్‌ఫుల్ 5 మంచి హిట్ అయితే , అభిమానులు జాలీ ఎల్‌ఎల్‌బి 3 కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశించవచ్చు. అక్షయ్ కెరీర్ పునరుద్ధరించబడవచ్చు. అయితే అలా జరుగుతుందా లేదా అనేది ఇప్పటికి పెద్ద ప్రశ్నే.