
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న “అఖండ 2 : తాండవం” సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం – “అఖండ 2”కు సంబంధించిన అన్ని వ్యాపార డీల్స్ పూర్తయ్యాయి!
డిజిటల్ రైట్స్‌ను Jio Plus Hotstar రికార్డ్ స్థాయిలో ₹85 కోట్లకు సొంతం చేసుకుంది.
శాటిలైట్ రైట్స్ కూడా ₹60 కోట్లకు అమ్ముడయ్యాయి.
థియేట్రికల్ రైట్స్ బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ధరకు క్లోజ్ అయ్యాయి.
అంటే సినిమా విడుదలకు ముందే ప్రొడ్యూసర్లు భారీ లాభాల్లోకి వెళ్ళిపోయారు!
ప్రస్తుతం థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉండగా, బోయపాటి శ్రీను ఫైనల్ ఎడిట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. అన్ని షూటింగ్ పనులు పూర్తయ్యాయి. “అఖండ 2” డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సారి బోయపాటి చూపించబోయే “తాండవం” ఎలా ఉండబోతోందో చూడటానికి మాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు!
