టాలీవుడ్‌ నుంచి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్న స్టార్‌ ప్రభాస్‌ — ప్రతి సినిమాకూ రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త రికార్డ్‌ సెట్‌ చేశాడు.

‘పుష్ప’ సిరీస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన తర్వాత, బన్నీ డిమాండ్‌ హైగా పెరిగింది. తాజాగా అతడు ఒక్క సినిమాకి రూ.175 కోట్ల పారితోషికం డీల్‌ కుదుర్చుకున్నాడు! ఇది ప్రభాస్‌ కంటే ఎక్కువ — అంటే తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద రెమ్యునరేషన్‌!

ఈ భారీ ప్రాజెక్ట్‌ని అట్లీ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఎక్కువ భాగం షూట్‌ ముంబై, యుఏఈ, యుఎస్ఏలో జరగనుంది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌, టాప్‌ స్టూడియోస్‌ నుంచి వీఎఫ్ఎక్స్‌ టీమ్స్‌ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి.

బన్నీతో పాటు దీపికా పదుకోన్‌, మృణాల్‌ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్‌ వచ్చే ఏడాది ముగుస్తుంది.

సంక్రాంతి 2026కి టైటిల్‌ అండ్‌ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయబోతున్నారని టాక్‌!
2027లో థియేటర్స్‌లో అల్లు అర్జున్‌ సెన్సేషన్‌ చూడబోతున్నాం!

“పుష్పని మించిన బన్ని మానియా స్టార్ట్ అయ్యిందా?” అనే మాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి!

, , , , ,
You may also like
Latest Posts from