సినిమా వార్తలు

‘అఖండ 2’ కు అల్లు అర్జున్ షాకింగ్ ట్విస్ట్? ఇలా చేసేవేంటి బ్రో

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ ప్రస్తుతం మార్కెట్‌లో అద్భుతమైన హైప్ సృష్టిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్, హిందీ బెల్ట్—ఎక్కడ చూసినా ఈ సీక్వెల్ చుట్టూ బజ్ పీక్‌లో ఉంది. ట్రేడ్ వర్గాలు చెప్పే ఒకే మాట:

“బాలయ్య సినిమా కాదు… ఈసారి పాన్–ఇండియా మాస్ ఎక్స్‌ప్లోజన్!”

ఇంత క్రేజ్ ఉన్న సమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్కేల్లో ప్లాన్ చేశారు. కానీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది!

అల్లు అర్జున్ అఖండ 2 ఈవెంట్‌కి రావట్లేదా? – షాకింగ్ ట్విస్ట్!

2021లో విడుదలైన అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ హాజరై స్టేజ్‌ ని వేడిక్కించారు. అదే పాజిటివ్ వైబ్ కొనసాగించాలని ఈసారి ‘అఖండ 2’ టీమ్ కూడా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం—

అల్లు అర్జున్ ఈసారి అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రాలేరు!
కారణం: ఆయన షూటింగ్ షెడ్యూల్ బాగా టైట్‌గా ఉండటమే.

అయితే ఫ్యాన్స్‌ను హార్ట్‌బ్రేక్ చేయకుండా, బన్నీ టీమ్‌కి ఇలా చెప్పారని తెలుస్తోంది:
“మూవీ రిలీజ్ అయిన తర్వాత జరిగే సక్సెస్ ఈవెంట్‌కి తప్పకుండా వస్తా.”

ప్రీ-రిలీజ్ ఈవెంట్ డీటైల్స్

తేదీ: నవంబర్ 28
స్థలం: కైతలాపుర గ్రౌండ్స్, కూకట్‌పల్లి, హైదరాబాద్

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నట్టు సమాచారం.

థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ – ఫ్యాన్స్‌కి బంపర్ ట్రీట్!

అదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా లైవ్‌లో అన్ని పాటలు పెర్ఫార్మ్ చేయబోతున్నాడు.
ఇప్పటివరకు రెండు పాటలే రాగా— అఖండ 2 పూర్తి జ్యూక్‌బాక్స్ కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనే విడుదల కానుంది!

అంటే…
మాస్ + మ్యూజిక్ మాన్స్టర్ నైట్ గ్యారెంటీ!

Similar Posts