పుష్ప 2: ది రూల్ సినిమా మరో సారి వార్తల్లో నిలుస్తోంది. భారీ బ్లాక్‍బస్టర్ కొట్టి అనేక రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసినట్లే ఓటిటిని రప్పాడించేస్తోంది.
ఇప్పుడు ఓటీటీలో పుష్ప 2 సినిమా హవా చూపిస్తూ…. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నేషల్ గా పేరున్న ఓ సోషల్ మీడియా హ్యాండిల్ ఈ చిత్రం క్లైమాక్స్ గురించి ఓ పోస్ట్ వేసింది. ఇదే డిస్కషన్ కు తెర లేపింది. అసలు ఇది నిజమైన పోస్ట్ కాదని, పెయిడ్ ప్రమోషన్ అంటున్నారు.
గతంలో నెట్ ప్లిక్స్ లో వచ్చాక ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఇలాగే ఇంటర్నేషనల్ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ లు పడ్డాయి. అలాగే ఇప్పుడు పుష్ప 2 కు కూడా పడటంతో అందరూ ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది.
ప్రస్తుతం (ఫిబ్రవరి 1) నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. ఇండియా ట్రెండింగ్‍లో టాప్-1లో పుష్ప 2 సత్తాచాటుతోంది.
జనవరి 30వ తేదీన పుష్ప 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
అదనపు ఫుటేజ్ ఉన్న రీలోలెడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. భారీ వ్యూస్ సాధిస్తూ ఇంటర్నేషనల్ రేంజ్‍లో దుమ్మురేపుతోంది.