ఎప్పుడూ తన టైమింగ్‌తో నవ్వులు పూయించే నవీన్ పోలిశెట్టి మరోసారి ఫన్ మోడ్‌లోకి వచ్చేశాడు! ఈసారి ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి రిలీజ్ చేసిన దీపావళి ఫన్ బ్లాస్ట్ ప్రమో సోషల్ మీడియాలో కరెంటు పడ్డట్టే ట్రెండ్ అవుతోంది.

ప్రమో మొత్తం పండుగ ఉత్సాహంతో నిండిపోయి, నవీన్ ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్, హాస్య పంచ్‌లు చూస్తేనే ఈ సంక్రాంతికి నవ్వుల వర్షం కురవబోతుందనిపిస్తోంది.

తాజాగా మేకర్స్‌ చాలా రోజుల త‌ర్వాత దీపావ‌ళి సంద‌ర్భంగా క్రేజీ అప్‌డేట్ అందించారు మేక‌ర్స్‌. సినిమా ఎలా ఉండ‌బోతుందో హింట్ ఇచ్చే్స్తూ.. దివాళి ఫ‌న్ బ్లాస్ట్ ప్రోమోను విడుద‌ల చేశారు.

అరే హ్యాపీ దీపావ‌ళి అన్నా.. ఏం కావాలి.. ఏమేం దొరుకుతయంటే ప‌ట్టుచీర‌లు, సిల్క్ శారీస్ అన్ని దొరుకుతాయి.. త‌న ద‌గ్గ‌ర పటాకాయ‌ల షాపుకి వ‌చ్చి ప‌ట్టుచీర‌లు దొరుకుతాయా అన్నా.. ? రాజు రాకెట్స్ అంటూ న‌వీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్‌తో మొద‌లైన ప్రోమో సూప‌ర్ ఫ‌న్‌గా సాగుతుంది. అన‌గ‌న‌గా ఒక రాజు ఫ‌న్‌, ఫ్రెస్ నెస్‌, ఫీల్ గుడ్ హ్యూమ‌ర్ ట‌చ్‌తో ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్‌గా న‌వీన్ పొలిశెట్టి కామిక్ టైమింగ్ ఉండ‌బోతుంద‌ని దీవాళి ఫ‌న్ బ్లాస్ట్ ప్రోమో చెబుతోంది.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో నవీన్ పొలిశెట్టి లుంగీ, బనియన్‌ వేసుకుని, మెడలో రుమాలు వేసుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకుపై వెళ్తూ క్యూరియాసిటీ పెంచుతోంది. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్‌లో — “ఇదే నిజమైన నవీన్!” అంటూ ట్వీట్లు, రీల్స్‌తో టైమ్‌లైన్స్ నింపేస్తున్నారు. ‘జాతి రత్నాలు’ తర్వాత ఇదే బెస్ట్ అవతార్ అంటూ కామెంట్లు కురుస్తున్నాయి.

ఇదిలా ఉంటే, సినిమా టీమ్ కూడా హైప్ పెంచేసింది — ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతోందని అనౌన్స్ చేశారు! అంటే మరింత ఫన్, క్యాచీ బీట్స్ గ్యారెంటీ!

మారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ సరసన అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ జె. యూవరాజ్ — అంటే ఫుల్ ఫెస్టివ్ ఫీల్ గ్యారెంటీ!

ఈ సంక్రాంతికి నవ్వులతో కింగ్ గా రానున్నాడు మన రాజు — ‘అనగనగా ఒక రాజు’!

, , , ,
You may also like
Latest Posts from