చిరంజీవి విశ్వంభర వాయిదా పడింది…
కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా పూర్తవలేదు అంటారు.

ఇప్పుడు
అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఘాటీ సినిమా కూడా అదే కారణంతో వాయిదా పడింది అనే సమాచారం!
అయితే “ఇది నిజంగా వీఎఫ్‌ఎక్స్ సమస్యా… లేక బిజినెస్ సమస్యలా ?” ఇది ట్రేడ్ లో పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారి డిస్కషన్ కు తెర తీస్తున్న విషయం.

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ విజయం తర్వాత నటి అనుష్క (Anushka) నుంచి రానున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఘాటి’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్రమ్‌ ప్రభు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా (Ghati Release Date) ఏప్రిల్‌ 18న రానుందనే ఇప్పటిదాకా న్యూస్ . అయితే అది నిజమయ్యేలా కనపడటం లేదు.

విడుదల తేదీని మే నెలకు నెట్టారు. కానీ ఇప్పుడు, దాని కొత్త విడుదల తేదీ గురించి ఎటువంటి సంచలనం లేదా ప్రకటన లేదు. జూన్ నెలాఖరులోగానీ, జూలైలోగానీ ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని భాగాల విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావడమే సినిమా వాయిదాకు కారణం.

మరో ప్రక్క ప్రమోషన్స్ ని వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది చిత్ర టీమ్. దీని కోసం ప్రత్యేకంగా రెండు ట్రైలర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం (Ghati Trailer). వీటిలో ఒకదాన్ని ఈనెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

మరో ట్రైలర్‌ను సినిమా విడుదలకు ముందు బయటకు వదలాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ క్రైమ్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. అనుష్క మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనుంది.

, , ,
You may also like
Latest Posts from