సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ ఓ ట్రెండ్‌సెట్టింగ్ లవ్ స్టోరీ. ఓ పక్క క్లాస్ ప్రేక్షకులకు కిక్కు, మరో పక్క మాస్ ఆడియన్స్‌కి మైండ్‌గేమ్ — ఓ హిట్ ఫార్ములా దర్శకుడిగా సుకుమార్‌ను పరిశ్రమకు పరిచయం చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనూ అదే సినిమా టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ‘ఆర్య 2’ ఫ్లాప్ అయినా, స్టైల్, డైలాగ్స్, మ్యూజిక్‌తో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది.
ఇలాంటి సిరీస్‌కు ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ అయిందంటే… సహజంగానే అందరూ ఊహించింది – “బన్నీ & సుక్కు రీయూనియన్!”
కానీ ట్విస్ట్ ఏంటంటే… ఈసారి ఆ టైటిల్ ఆశీష్ కోసం అని తెలుస్తోంది!
అవును, ‘రౌడీ బోయ్స్’, ‘లవ్ మీ’ సినిమాలతో లక్క్ టెస్ట్ చేసుకున్న దిల్ రాజు వారసుడు ఆశీష్ ఇప్పుడు సుకుమార్ కథతో ‘ఆర్య 3’లో హీరోగా కనిపించనున్నాడని సమాచారం. ఈ కాంబోలో ‘సెల్ఫిష్’ అనే సినిమా మొదలై మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కథకు పునర్నిర్మాణం జరుగుతుండగా, దానికి ‘ఆర్య 3’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే అసలైన ప్రశ్న ఏంటంటే — బన్నీ చేసిన ఆర్య క్యారెక్టర్‌కి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆ స్థానాన్ని నెరవేర్చడం అలాంటిదే… మిడిల్ ఆఫ్ ది స్టేడియంలో ఎవరు గ్యాంగూలీ బ్యాట్ అందుకుంటే ఏంటినేది ప్రశ్న అయినా వారు దాదాగిరీ కొనసాగించగలరా అనే ప్రశ్నలాంటిది!
దిల్ రాజు మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై సీరియస్‌గా ఉన్నాడు. సుకుమార్ కథ ఇవ్వనుండగా, దర్శకత్వ బాధ్యతలు ఆయన శిష్యులే తీసుకునే ఛాన్స్ ఎక్కువ. సుకుమార్ మైండ్‌ను అర్థం చేసుకున్నవారే ఈ ఎమోషనల్-ఇంటెలిజెంట్ లవ్‌స్టోరీని మళ్లీ ఆ స్థాయిలో డెలివర్ చేయగలరన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు.
స్క్రిప్ట్, డైరెక్టర్, కాస్టింగ్ అన్నీ క్లీన్‌గా లైన్‌లోకి వచ్చిన తర్వాతే దిల్ రాజు ‘ఆర్య 3’ అనే టైటిల్‌ను అధికారికంగా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.
ఇక అసలైన సస్పెన్స్ ఏంటంటే —
బన్నీ ఓ గెస్ట్ రోల్ అయినా చేస్తాడా?
లేదా ‘ఆర్య’ టైటిల్ ఏ మేరకు కలిసొస్తుంది?
సుకుమార్ శిష్యుడు ఈ ప్రెజర్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు?
సినిమా వస్తే కానీ ఓ క్లారిటీ రావడం కష్టం!