బాలీవుడ్ ఐటెం గార్ల్ మలైకా అరోరాకు.. ముంబైకి చెందిన న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన గొడవకు సాక్ష‍్యంగా కోర్టులో హాజరు కావాలని పదేపదే చెబుతున్నా మలైకా రావట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది.

కేసు ఏమిటి

2012 ఫిబ్రవరి 22న హీరో సైఫ్ అలీఖాన్, కరీన్ కపూర్, మలైకా అరోరాతో పాటు కొందరు ఫ్రెండ్స్.. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బిజినెస్ మ్యాన్ తో గొడవ జరిగింది.

దీంతో సైఫ్.. సదరు బిజినెస్ మ్యాన్ ముక్కుపై గట్టిగా గుద్దాడు. దీంతో విషయం పోలీసు కేసుల వరకు వెళ్లింది. ఈ గొడవకు కారణమైన సైఫ్ అలీఖాన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ పై బయటకొచ్చేశారు.

అయితే ఈ కేసులో సాక్ష‍్యం చెప్పేందుకు కోర్ట్ ఎదుట హాజరు కావాలని మలైకాకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న నోటీసులు పంపించారు. కానీ రాలేదు. తాజాగా ఏప్రిల్ 7న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన గైర్హాజరు అయింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం మలైకాకు బెయిలబుల్ అరెస్ట్ వారీ జారీ చేసింది. కోర్టును అగౌరవ పరిచినందుకుగాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని సదరు న్యాయస్థానం పేర్కొంది. ఏప్రిల్ 29కి ఈ కేసు వాయిదా పడింది.

ఇకపోతే తనతోపాటు వచ్చిన మహిళల్ని దూషించడం వల్లే సైఫ్ దాడిచేశాడని అంటున్నారు. మరి మలైకా నోరు విప్పితే గానీ అసలు నిజం బయటపడదు.

, ,
You may also like
Latest Posts from