సంక్రాంతికి బాల‌కృష్ణ (Balakrishna) సినిమా ‘డాకు మ‌హారాజ్’ బాక్సాఫీస్ చేస్తున్న సంద‌డి మామూలుగా లేరు. ఇటు కుటుంబ ప్రేక్ష‌కులు… అటు అభిమానులు చూసేందుకు పోటీ ప‌డ‌ుతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోను ‘డాకు మ‌హారాజ్’తో (Daku Maharaj ) బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు హిందీకు వెళ్తోంది. మాస్‌ సినిమాల‌కి పెట్టింది పేరైన యువ ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి తెర‌కెక్కించారు.

నార్త్ లో డాకు మహారాజ్ ని రిలీజ్ కి మేకర్స్ సిద్ధం చేశారు. హిందీలో ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో బాలయ్య సందడి చేయనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

స్టైలిష్‌గా హీరోని తెర‌పై ఆవిష్క‌రిస్తూ, విజువ‌ల్‌గా హాలీవుడ్ సినిమాల్ని గుర్తు చేస్తూ సినిమాని తెర‌కెక్కించారు.

బాల‌కృష్ణ సినిమాల్లో ఇదివ‌రకు చూడ‌ని ఓ కొత్త నేప‌థ్యాన్ని ఇందులో ఆవిష్క‌రించారు. వీట‌న్నిటికీ తోడు బాల‌కృష్ణ మాస్ అంశాలు ఉండ‌నే ఉన్నాయి.

ఈ కథ తెలిసిందే అనిపించినా, తెర‌పై స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా… థియేట‌ర్‌లో ఉన్నంత‌సేపూ ఆ విష‌యాలేవీ గుర్తుకు రాకుండా, ఓ కొత్త సినిమా చూస్తున్నామ‌నే అనుభూతి ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది.

‘సింహా’లో వైద్యుడిగా ఎలా క‌నిపించాడో, అలా ఇంజినీర్ సీతారాంగా హుందాగా క‌నిపిస్తాడు బాల‌కృష్ణ‌.

అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్రం రాయ‌ల‌సీమ పౌరుషాన్ని ప్ర‌ద‌ర్శించే ఆ పాత్ర బాగా కుదిరింది. యాక్ష‌న్ ఘ‌ట్టాలు సినిమాపై చాలా ప్ర‌భావం చూపిస్తాయి కానీ, ఎక్క‌డా ఓవ‌ర్ ది టాప్ అన్న‌ట్టు ఉండ‌వు.

, , , , ,
You may also like
Latest Posts from