అఖిల్ అక్కినేని 2023 ఏప్రిల్ లో వచ్చిన “Agent” తర్వాత కేరియర్‌లో బిగ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ మధ్యలో వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌కు కొత్త హోప్ ఇచ్చేలా “Lenin” అనే ఫిల్మ్ లాంచ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున (nagarjuna), సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇది అఖిల్ నటిస్తున్న 6వ చిత్రం. కానీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గాని, షెడ్యూల్ డిటేల్స్ గానీ బయిటకు రాలేదు.
అందుకు కారణం హీరోయిన్ శ్రీలీల ఇతర కమిట్మెంట్స్ కారణంగా ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లటంతో ఆపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ స్రైక్ ముగిసిన తర్వాత, ప్రొడక్షన్ రీస్టార్ట్ ప్లాన్ చేస్తున్నారు.
శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే రాబోతున్నారని తెలుస్తోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
ఏమైనా, కొత్త ఫీమేల్ లీడ్‌తో షూటింగ్ మొదలైనప్పటికీ, “Lenin” 2026 Summer కంటే ముందే రిలీజ్ అవ్వడం కష్టమే . అంటే, అఖిల్ కి “Agent” తర్వాత మూడేళ్ల గ్యాప్ వచ్చేలా ఉంది.
ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మంచి క్రేజ్ తెచ్చుకుంది.
‘‘గతాన్ని తరమడానికి పోతా మా నాయన నాకో మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడలాంటే’’ అంటూ అఖిల్ సంభాషణలతో సాగిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది. ఈ ప్రచార చిత్రంలో ఆయన్ని భారతంలో అర్జునుడిలా పరిచయం చేసిన తీరు.. మాస్ లుక్‌లో తను కనిపించిన విధానం ఆకర్షణగా నిలిచాయి.
ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: నవీన్ కుమార్.