
ఓటీటీ హవా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నెలల తరబడి ఆడటం దాదాపు అసాధ్యం. ఎన్ని హిట్ టాక్ వచ్చినా ఎక్కువలో ఎక్కువ మూడు, నాలుగు వారాలకే థియేటర్ల నుంచి మాయమైపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
అదే F1 మూవీ!
జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వంలో బ్రాడ్ పిట్ హీరోగా వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ థియేటర్లలో అద్భుతమైన 100 రోజుల రన్ సాధించింది. ఒక వారం కూడా ఆడటమే కష్టమైన ఈ రోజుల్లో 100 రోజులు ఆగని రన్ అంటే… నిజంగా అరుదైన ఘనతే!
బ్రాడ్ పిట్ ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్‌గా చూపించిన నటన ప్రేక్షకులకు స్పెషల్ థ్రిల్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో చూడటం వాళ్లకే ఒక లైవ్ రేస్ చూడటంలా అనిపించిందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉన్నా, ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. హైదరాబాదుతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రేక్షకులు F1 ఫీవర్లో మునిగిపోతున్నారు.
ఓటీటీ యుగంలోనూ 100 రోజులు థియేటర్లలో దూసుకెళ్లిన బ్రాడ్ పిట్ F1 మూవీ – నిజంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది!
