కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.శివకార్తికేయన్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. శివ గత చిత్రం అమరన్ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇటీవల కాలంలో తమిళ సినిమాలు తెలుగులో అంతగా మెప్పించలేకపోతున్నాయి. ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ నెలకొంది.

మదరాసి సినిమా మీద సెన్సార్ కత్తెర – 100 సెకన్లు కట్ చేసిన బోర్డు

ఇంకా రెండు రోజుల్లోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబినేషన్ సినిమా మదరాసి పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. బుకింగ్స్ మొదట్లో ఆశించిన స్థాయిలో లేకపోయినా, అభిమానుల్లో మాత్రం పాజిటివ్ వైబ్స్ బలంగా ఉన్నాయి.

అయితే సెన్సార్ విషయంలో మాత్రం చిన్న అడ్డంకి ఎదురైంది. సినిమా యూనిట్ 169 నిమిషాలు 19 సెకన్ల రన్‌టైమ్‌తో అప్లై చేయగా, సెన్సార్ బోర్డు 1 నిమిషం 46 సెకన్ల ఫుటేజ్ తొలగించి, చివరికి 167 నిమిషాలు 33 సెకన్ల నిడివి కుదిరింది.

తొలగించిన సీన్లలో ఎక్కువగా యాక్షన్ – హింసాత్మక సన్నివేశాలే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పిల్లలను కలుపుకుని వచ్చే కొన్ని సన్నివేశాలు, రక్తపాతం చూపించే షాట్లు, అలాగే కొన్ని అసభ్య పదజాలం, ఉత్తర భారత రాష్ట్రాల పేర్లను ప్రస్తావించిన డైలాగ్స్ తొలగించబడ్డాయి.

మదరాసి పై మురుగదాస్ నమ్మకం

ఆడియో లాంచ్ వేదికగా దాదాపు అరగంట పాటు మాట్లాడిన ఎ.ఆర్. మురుగదాస్ , శివకార్తికేయన్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. అతని అంకితభావం, నటనలో వచ్చిన అభివృద్ధిని ప్రశంసిస్తూ, మదరాసి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

క్రేజ్ ఎక్కడుందంటే…

ఇప్పటికే సోషల్ మీడియాలో మదరాసి ట్రైలర్, సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది మాస్ పాయింట్‌ ఆఫ్ వ్యూ నుంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మురుగదాస్ స్టైల్ మేకింగ్, ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందన్న అంచనాలు ప్రేక్షకుల్లో బలమైన హంగామా క్రియేట్ చేస్తున్నాయి.

, , , , ,
You may also like
Latest Posts from