విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కలయికలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “ఛావా’. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా తెలుగులో కూడా మంచి డిమాండ్ నడుమ రిలీజ్ కి వచ్చింది.

తెలుగులో మంచి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ చిత్రం ఇపుడు మొత్తం 6 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ 6 రోజుల్లో 12.76 కోట్ల గ్రాస్ ని అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే అందుకున్నట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది అని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే తెలుగులో గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

, ,
You may also like
Latest Posts from