
మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన “అధిక ఫీజులు వసూలు” ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాము నియమాల ప్రకారమే ఫీజులు స్వీకరించామని యూనివర్సిటీ ఛైర్మన్, నటుడు మంచు విష్ణు స్పష్టంచేశారు. “తప్పుడు ప్రచారం నమ్మొద్దు, మా సంస్థ ప్రతిష్ఠను కాపాడండి” అంటూ ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే — విష్ణు వివరణకు పూర్తి విరుద్ధంగా ఉన్నత విద్యా కమిషన్ నివేదిక బాంబు లాంటి షాక్ ఇచ్చింది.
విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆదాయాన్ని వెల్లడించకపోవడం, అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం తదితర కారణాలతో యూనివర్సీటికి కమిషన్ 15 లక్షల జరిమానా విధించింది.
అయితే ఈ సోమ్మును వర్సీటి చెల్లించగా.. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల 17లక్షల 52 వేలు తిరిగి చెల్లించాలని… గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది.
2022-23 నుంచి గతేడాది సెప్టెంబరు 30 వరకు విద్యార్థుల నుంచి… మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26 కోట్ల 17 లక్షలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు… 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అలాగే విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం UGC, AICTE సహా… సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది.
యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా
అదనంగా వసూలైన రూ.26 కోట్లు 15 రోజుల్లో రిఫండ్ చేయాలి
గుర్తింపు రద్దుపై ప్రభుత్వం పరిగణించాలి — సిఫారసు కూడా జారీ!
దీనిపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కావాలని తప్పుడూ ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు.
మోహన్‌బాబు విశ్వవిద్యాలయం (Mohan Babu University)కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై వివిధ మీడియా మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ వైస్-ఛైర్మన్ మంచు విష్ణు ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు.
ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని ఆయన తల్లిదండ్రులకు మీడియాకు విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన అన్నారు. తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో తాము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మంచు విష్ణు ఈ సందర్భంగా రాసుకోచ్చాడు.
ఇక ఈ పరిణామాల తరువాత, విద్యా వర్గాల్లో చర్చ ఒక్కటే —
“మోహన్ బాబు యూనివర్సిటీ భవితవ్యం ఏమవుతుంది?”
“కమిషన్ చర్యల వెనుక అసలు కారణం ఏమిటి?”
“విష్ణు కౌంటర్ సరైనదా లేదా డ్యామేజ్ కంట్రోలా?”
ఒకవైపు కమిషన్ కఠిన నిర్ణయాలు, మరోవైపు యాజమాన్యం తాము ‘క్లీన్’ అని చెబుతుండటంతో — ఈ వివాదం ఇంకా బిగ్ క్యాంపస్ వార్ లా మారుతోంది.
