రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది.
అయితే, రెండో వీకెండ్‌లో సినిమా కొంచెం ఊపిరి పీల్చుకుంది. మొత్తం 40 కోట్ల గ్రాస్ సాధించి, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు దాదాపు 475 కోట్లకు చేరుకున్నాయి.
ఈ వారం వినాయక చవితి హాలిడే ఉంది. అదే బూస్ట్‌గా మారితే, మూడో వీకెండ్‌లో కనీసం ఈ వీకెండ్‌లో వచ్చిన కలెక్షన్స్‌లో సగం అయినా రాబడితే, సినిమా రికవరీ 85% దాటే అవకాశం ఉంది.
“కూలీ”కి బ్రేక్ ఈవెన్ 600 కోట్లు . ఇప్పటివరకు 79% రికవరీ సాధించింది. ఫైనల్‌గా సినిమా Below Average–Average రేంజ్‌లోనే ఆగిపోయేలా కనిపిస్తోంది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే… “కూలీ” ఆగస్ట్ 14న వార్ 2 తో నేరుగా క్లాష్ అయ్యింది. కంటెంట్ మాత్రం ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టు లేకపోయినా, సినిమా లో లెవెల్ కలెక్షన్స్‌తోనైనా స్థిరంగా నడుస్తూ ట్రేడ్‌కి కొంత రిలీఫ్ ఇచ్చింది.