రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
మరో ప్రక్క ‘కూలీ’ సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు వారాలు ఉన్నా, అమెరికాలో యుద్ధం లాంటి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి! బుకింగ్ విండో ఓపెన్ అయ్యిన దగ్గరనుంచే అగ్రెసివ్‌గా టిక్కెట్లపై దూకుడు చూపిస్తున్నారు అభిమానులు.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అమెరికాలో ఇప్పటికే $300K మార్క్ క్రాస్ చేసింది — అది కూడా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రమే! ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కూ మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఇది మొదటిరోజే రికార్డ్ ఓపెనింగ్‌కు దారి తీస్తుందనే సంకేతం.
ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ‘కబాలి’ ఓపెనింగ్ రికార్డ్ కలిగిన కోలీవుడ్ మూవీగా నిలిచింది. కానీ ఈసారి అదే రజినీ తన సొంత రికార్డునే బీట్ చేయబోతున్నారు – అది కూడా మరి తేడా లేకుండా!
ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే — ఇదే రోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మరో సినిమా కూడా విడుదల కాబోతుండటం! ‘కూలీ’ vs ‘వార్ 2’ అనే భారీ క్లాష్ ఇప్పుడు బాక్సాఫీస్‌లో మొదలైంది.
ఇక ‘కూలీ’ విషయానికొస్తే భారీ బడ్జెట్, భారీ తారాగణంతో లోకేశ్ దీన్ని తీర్చిదిద్దారు. ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే ఆడి పాడింది. ఆమిర్‌ఖాన్ కూడా అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు. ఆగస్టు 14న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘కూలీ’ని విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ ఈ మూవీ తీసుకొస్తున్నారు. రజనీకాంత్ ఇందులో కూలీ నెంబర్ 1421గా దేవా పాత్రలో సందడి చేయనున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.