సినిమా వార్తలు

బాక్సాఫీస్ ట్విస్ట్: ముగ్గురు స్టార్స్ ఫెయిల్… కొత్త వాళ్లు టాప్‌లో!

ఈ శుక్రవారం రిలీజ్ అయిన రాజ్ తరుణ్ “Paanch Minar”, ప్రియదర్శి “Premante”, అల్లరి నరేష్ “12A Railway Colony” — ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. స్టార్ ఫేస్లు ఉన్నా… థియేటర్ల వద్ద మాత్రం జనాలు తిరిగి చూడలేదు!

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే—
కొత్త ముఖాలతో వచ్చిన “Raju Weds Rambai” మొదటి రోజే అన్ని సినిమాలకు షాక్ ఇచ్చింది!

న్యూ కమర్స్ షో: Day 1లో “Raju Weds Rambai” టాప్ పిక్!

ఎమోషనల్ క్లైమాక్స్‌తో నడిచే ఈ లవ్ స్టోరీ, తన స్కేలు కంటే ఎక్స్‌పెక్టెడ్‌ కన్నా చాలా బెట్టర్‌గా ఓపెన్ అయింది. సెంటర్లన్నింటిలో అదే హాట్ టాపిక్… అదే ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్!

అఖిల్ ఉద్దేమారి – తేజస్వి రావు
ఈ ఇద్దరు న్యూ కమర్స్‌కు ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో Day 1 వసూళ్లలో అద్భుతంగా కలెక్ట్ చేసింది.

“12A Railway Colony” దారుణం… “Premante” అయితే షాకింగ్ అవుట్!

అల్లరి నరేష్ నటించిన “12A Railway Colony” పూర్తిగా ఫ్లాప్ — డే 1 నుంచే క్లీన్ దెబ్బ. ప్రియదర్శి “Premante” కి థియేటర్లలో క్యాన్సిలేషన్‌లు… కెరీర్‌లోనే ఇబ్బందికరమైన రోజు అని చెప్పాలి. ప్రొడ్యూసర్ జ్ఞానవి నారంగ్‌కి కూడా ఇది భారీ బ్లో.

మరోసారి బాక్సాఫీస్ రియాలిటీ నిరూపించింది: ఎవడూ చెప్పలేడు!

ఈ వీకెండ్ మరోసారి ప్రూవ్ చేసింది

బాక్సాఫీస్‌కి స్టార్ పేరు కాదు… ఆడియన్స్ మైండ్‌సెట్‌ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు! ఒక చిన్న సినిమా కూడా మొదటి రోజే అన్ని లైనప్‌లను క్రాస్‌ చేసి నెంబర్ 1 అవుతుంది అని “Raju Weds Rambai” మళ్ళీ చూపించింది.

Similar Posts