
మాధవన్ ఒక్క స్టోరీతో “గ్లోబ్‌ట్రాట్టర్” హైప్ మూడింతలు! అసలు ప్లాన్ ఇదేనా?
టాలీవుడ్లో గత దశాబ్దంలో ఏ సినిమాకి కనిపించనంత క్రేజ్, చర్చ … ప్రస్తుతం “గ్లోబ్‌ట్రాట్టర్” దగ్గర మాత్రమే కనిపిస్తోంది. ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఒక్క పోస్టర్‌కి ఇండియా అంతా హడావుడిగా రియాక్ట్ అవుతోంది. అధికారిక అనౌన్స్మెంట్ కూడా రాకముందే ఫ్యాన్స్ నుంచి ట్రేడ్ వరకు— “ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీని రీసెట్ చేస్తుంది!” అని చెప్పేంత రేంజ్లో హైప్ పీక్‌కి చేరిపోయింది.
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇప్పుడు వాటిని మించి “గ్లోబ్‌ట్రాట్టర్” ఒక గ్లోబల్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తోంది. ఇ షూటింగ్ కూడా పూర్తికాని సినిమా… క్యాస్ట్ రివీల్ అయ్యే ముందే…ఇండియన్ సినిమా ఎక్కువ మంది మాట్లాడుతున్న ప్రాజెక్ట్ గా నిలుస్తోంది.
మాధవన్ గ్లోబ్ట్రాట్టర్లో ఉన్నట్టేనా? ఒక్క రీపోస్ట్‌తో అప్డేట్!
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న “గ్లోబ్‌ట్రాట్టర్” దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన నటులు:
మహేష్ బాబు
ప్రియాంకా చోప్రా
పృథ్వీరాజ్ సుకుమారన్
మిగతా పాత్రలు మాత్రం టాప్ సీక్రెట్.
ఇదే సమయంలో… అభిమానుల్లో హీట్ పెంచుతూ ఆర్. మాధవన్ ఒక్క చిన్న పని చేసి హైప్‌ను డబుల్ చేశాడు! ప్రియాంకా లుక్ రాగానే… మాధవన్ చేసిన రీపోస్ట్‌తో ఊహాగానాల పర్వం మొదలైంది!
ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను టీమ్ రిలీజ్ చేసిన వెంటనే, మంగళవారం మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్టర్‌ను షేర్ చేశాడు.
అంతే… నెటిజన్లు ఊహించి ఊగిపోయారు:
“మాధవన్ కూడా గ్లోబ్ట్రాట్టర్లో ఉన్నట్టే!”
“ఇది సైలెంట్ కన్ఫర్మేషన్ కాదా?”
“రాజమౌళి సినిమా అంటే స్టార్ స్టడెడ్ కాస్ట్ పక్కా!”
సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగులు వరుసగా ట్రెండ్ అయ్యాయి. మేకర్స్ మాత్రం ఇప్పటికి నోరు విప్పలేదు. కానీ మాధవన్ రీపోస్ట్ మాత్రం ఫ్యాన్స్‌ను గట్టిగా ఆలోచింపజేసింది. నవంబర్ 15న RFCలో హిస్టరీ క్రియేట్ అవుతుంది!
“గ్లోబ్‌ట్రాట్టర్” టైటిల్ రివీల్, ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్ ఎలా ఉంటుందో అన్నదానికి ఇండస్ట్రీలో భారీ టెన్షన్— ఎందుకంటే ఇది రాజమౌళి స్టైల్ కాబట్టి మరీ అలాంటి visuals, announcements రావడం ఖాయం.
ఇక మహేష్ ఫస్ట్ లుక్ కూడా అదే రోజు వెలువడే అవకాశముండటంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ ఆకాశం దాటేస్తోంది. హిందీ సినిమాల్లో బిజీ అయినా… టాలీవుడ్‌పై మాధవన్ ప్రేమ ఇంకా అలాగే! ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న మాధవన్, ఇప్పటికే అనుష్క శెట్టితో చేసిన “నిశ్శబ్దం” ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
అందుకే నెటిజన్లలో భారీ ఊహాగానాలు:
“మాధవన్ గ్లోబ్ట్రాట్టర్లో కీలక పాత్ర చేస్తున్నాడని 99% ఛాన్స్!”
“జక్కన్న సినిమా! ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఎవరు మిస్ అవుతారు?”
చివరగా..
ఒక్క రీపోస్ట్తోనే దేశం మాట్లాడేలా చేసిన మాధవన్… అసలు అనౌన్స్మెంట్ వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి!
“గ్లోబ్‌ట్రాట్టర్” ప్రతి అప్డేట్తో హైప్‌ను మూడింతలు పెంచుకుంటూ, ఈ ఏడాది కాదు… వచ్చే దశాబ్దపు బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాగా తయారవుతోంది.
