బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమెకు కేవలం నార్త్ బెల్ట్ లోనే కాకుండా ఇక్కడ సౌత్ లోనూ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. రీసెంట్ గా ఆమె స్టార్ హీరో సూర్య సరసన ‘కంగువా’ సినిమా చేసింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్‌ టాక్‌ రావడంతో బిగ్‌ ఓపెనింగ్స్‌ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది. అయితేనేం దిశా ఆఫర్స్ కు లోటు లేదు. ఇప్పుడో హాలీవుడ్ ఆఫర్ అందుకుంది.

ఇప్పటికే మన భారతీయ నటీమణులు ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే హాలీవుడ్ చిత్రాలలో కనిపించారు. ప్రియాంక చోప్రా అనేక అమెరికన్ వెబ్ డ్రామాలలో నటించి ప్రపంచ ఖ్యాతిని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దిశా పటానీ హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

దిశా ప్రస్తుతం అమెరికన్ ఆన్‌లైన్ సిరీస్ “డురాంగో” కోసం పనిచేస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” నటుడు హ్యారీ గుడ్‌విన్స్, టైరీస్ గిబ్సన్‌తో కలిసి మెక్సికోలో ఈ ఆన్‌లైన్ డ్రామా సెట్స్‌లో ఆమె ఫోటో తీసారని చెప్తోంది ఆమె.

దిశా పటాని ఇటీవల ప్రభాస్ సూపర్ హిట్ “కల్కి 2898 AD”లో కనిపించింది. ఈ సినిమా రెండో భాగంలోనూ ఆమె కనిపించనుంది.

Instagram యొక్క అత్యంత పాపులర్ ఫేసెస్ లలో దిశా పటానీ కూడా ఒకరు. ఆమెకు 61 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

, ,
You may also like
Latest Posts from