తెలుగులో రెండు సినిమాలు గురించే ఎక్కువ బజ్ వినిపిస్తోంది. అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మాగ్నమ్‌ ఓపస్‌. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రూపుదిద్దుకుంటున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ రెండు సినిమాలు ఇప్పటికే అభిమానుల్లో అద్భుతమైన అంచనాలు రేకెత్తిస్తున్నాయి.

ఒక్కో ప్రాజెక్ట్‌ వెనకున్న భారీ బడ్జెట్ స్కేలు, స్టార్ పవర్, క్రేజ్ అన్నీ చూస్తే విడుదల రోజున దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా, సోషల్ మీడియా ట్రెండ్స్, బాక్సాఫీస్ కలెక్షన్ల రేంజ్ — ఇవన్నీ ఒక కొత్త రికార్డు స్థాయిని తాకే అవకాశముంది.

ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద క్లాష్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, రెండు సినిమాలు వాళ్లు తమ దగ్గర ఉన్న ప్లానింగ్‌ ప్రకారం 2027 మార్చి 25 న రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అయితే రెండు సినిమాలు ఒకేసారి ఆ డేట్‌లో రావడం అసాధ్యం. భారీ బడ్జెట్‌, అంతర్జాతీయ మార్కెట్‌ లక్ష్యం, విపరీతమైన డిస్ట్రిబ్యూషన్‌ ప్లాన్లతో ఉన్న ఈ సినిమాలు ఒకదానికొకటి ఢీ కొనటం సాధ్యమే కాదు.

మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ అప్డేట్‌ ఈ నవంబర్‌లో రానుందని, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ అప్‌డేట్‌ మాత్రం ఈ దీపావళి బహుమతిగా అందిస్తారని టాక్‌. ఎవరు ముందుకు వచ్చి 25 మార్చి 2027ను దక్కించుకుంటారు? ఎవరైతే ముందుగా అడుగు వేస్తారో వారికే ఆ సమ్మర్ బాక్సాఫీస్‌ రాజ్యం సొంతమవుతుంది.

, , , , , , ,
You may also like
Latest Posts from