పాన్‌–ఇండియన్ స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల్ని ఎమోషన్, యాక్షన్ మిశ్రమంతో ఆకట్టుకోబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో నడిచే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. కొత్త హీరోయిన్ ఇమాన్వి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగం కోసం ప్రభాస్ ఇంకా 35 రోజుల సమయాన్ని కేటాయించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టులో విడుదల కానుంది.

ఇంతలోనే ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది — హను రాఘవపూడి ‘ఫౌజీ’కి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట!
అయితే, ఈ ప్రీక్వెల్ ఆలోచనపై ప్రభాస్ ఇంకా ఓకే చెప్పలేదట. ‘ఫౌజీ’ రిలీజ్ అయ్యిన తర్వాత హను స్క్రిప్ట్‌పై ఫుల్‌గా పని చేసి, ప్రభాస్ ఇతర కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టే అవకాశముంది.

ఫైనల్ గా ..హను రాఘవపూడి విజన్, ప్రభాస్ పాన్-ఇండియా ఇమేజ్ కలిస్తే — ‘ఫౌజీ యూనివర్స్’ సృష్టి తప్పదని ఇండస్ట్రీ టాక్!

ఇది కేవలం సినిమా కాదు… ఒక కొత్త లెజెండ్‌కి ఆరంభం కావొచ్చు!

, , , , ,
You may also like
Latest Posts from