రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ఓటిటి రిలీజ్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. కలెక్షన్స్ పరంగా అనుకున్న స్థాయికి చేరుకోకపోయినా, చరణ్ నటన మాత్రం అందరికి నచ్చింది. ఇప్పటికే థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో సందడి చేయడానికి రెడీ అయింది.
ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాను ఫిబ్రవరి 7 నుంచి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్.
హిందీ, మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఓటిటిలో ఈ సినిమా బాగా వెళ్తుందని భావిస్తున్నారు.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు.
raa macha, buckle up 😎 the rules are about to CHANGE 👀#GameChangerOnPrime, Feb 7 pic.twitter.com/ewegjT69yL
— prime video IN (@PrimeVideoIN) February 4, 2025