గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్'(Game Changer) మూవీ ఇటీవల సంక్రాంతికి విడుదలై ప్లాఫ్ టాక్ మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు భారీగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘గేమ్‌ ఛేంజర్’ మూవీ యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఈ మూవీ టీంపై కొందరు జూనియర్ ఆర్టిస్టులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను మోసం చేశారంటూ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన కొందరు జూనియర్ ఆర్టిస్టులు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మూవీ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్‌కి 350 మంది వెళ్లామని బాధితులు తెలిపారు. అయితే కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టిస్ట్ తరుణ్.

నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన వారు ఆర్టిస్టుకు రూ.1200 లెక్కన చెల్లించకపోవడం ఏంటని షాక్ అవుతున్నారు.

, , ,
You may also like
Latest Posts from