నైజాంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలొస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే క్రేజ్‌ని మళ్లీ ఒకసారి చూపించేందుకు సిద్ధంగా ఉంది హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్.

ఇటీవల సెన్సార్ క్లియరెన్స్‌తో రెడీగా నిలిచిన ఈ చిత్రాన్ని నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలో మొదట పలువురు ప్రముఖ పంపిణీదారుల పేర్లు వినిపించాయి – దిల్ రాజు, మైత్రి మూవీస్ లాంటి వారు దీన్ని తీసుకుంటారని ఊహాగానాలు వినపడినా, చివరికి అవన్నీ ఒప్పందంగా మారలేదు.

అందుకే ప్రొడ్యూసర్లు భారీ అంచనాలతో డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలనుకున్న 65 కోట్లు అందలేకపోయి, స్వయంగా రిలీజ్ చేసేందుకు డెసిషన్ తీసుకున్నారు. క్రౌన్ మూవీస్ అనే సంస్థ నైజాం బిజినెస్‌ను చూడనుంది. ఎగ్జిబిటర్ల నుంచి దాదాపు రూ.40 కోట్లు అడ్వాన్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది.

ఇక మిగతా ఏరియాల బిజినెస్ కూడా త్వరలో పూర్తి కానుంది. ప్రమోషన్లకు కూడా కౌంట్ డౌన్ మొదలైంది. పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌పై అంచనాలు ఉండటంతో, హరి హర వీరమల్లు నైజాంలో ఎలాంటి వసూళ్ల సునామీ తీసుకొస్తుందో చూడాలి.

ఇక నైజాంలో హరిహర వీరమల్లు – పవన్ స్టైల్ ఓనర్ రిలీజ్!
బాక్సాఫీస్‌పై పవన్ స్టామినా మరోసారి రుజువు కానుందా?

, , , , , ,
You may also like
Latest Posts from