ఇప్పుడు దేశవ్యాప్తంగా హై అలర్ట్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. భారత సైన్యం పాక్‌పై మాస్ ఎటాక్ చేయడంతో దేశమంతా టెన్షన్ మూడ్‌లోకి వెళ్లింది. ప్రజల దృష్టంతా ప్రస్తుతం సెక్యూరిటీ, జాతీయత, బార్డర్ పరిస్థితులపైనే ఉంది. ఈ నేపధ్యంలో సినిమాలు, ఎంటర్టైన్మెంట్ అన్నవి బ్యాక్‌సీట్‌లోకి వెళ్లాయి.

ఈ పరిస్థితి ఇప్పటికే థియేటర్ లో ఉన్న సినిమాలపైనే కాదు, ఈ వారం రిలీజ్ కాబోయే కొత్త సినిమాల రిలీజ్‌లపై కూడా ప్రభావం చూపునున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నాని హీరోగా వచ్చిన HIT 3 సినిమా ఓపెనింగ్ వసూళ్ల పరంగా హిట్ కొట్టింది. రిలీజ్ వారం లాంగ్ వీకెండ్ కావడంతో, బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు వాతావరణం మారడంతో… వీక్‌డేస్‌లో ఆక్యుపెన్సీ డౌన్ ట్రెండ్‌లోకి వెళ్లిపోయింది.

వాస్తవానికి HIT 3 – నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటి. స్టైలిష్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్‌కి ప్రేక్షకుల నుంచి మొదటి రోజే మంచి స్పందన వచ్చింది.

మాస్ – క్లాస్ రెండింటినీ ఆకట్టుకునేలా ట్రీట్‌మెంట్ ఉండటంతో, ఇది పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ ప్రిడిక్షన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు…

“యుద్ధం” మూడ్ – “మూవీ” మూడ్‌ను డైల్యూట్ చేస్తోందా?

దేశమంతా ఉత్కంఠతో టీవీ చానెల్స్, న్యూస్ అప్‌డేట్స్‌కే పట్టు పడిపోతున్నారు. సినీపరిశ్రమ ఏదైనా ఎమోషన్‌తో కలిసే పని చేస్తుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ప్రజల మైండ్‌సెట్ వేరే ట్రాక్‌లో ఉంది. మాక్ డ్రిల్స్, అలర్ట్స్, మిలిటరీ యాక్టివిటీ నేపథ్యంలో థియేటర్ వెళ్లాలనేది సెకండ్ ప్రిఫరెన్స్‌గా మారుతోంది.

మరి HIT 3కి ఇది షాక్ అవుతుందా?

ఇదే ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగితే, HIT 3 వంటి సినిమాల వసూళ్లపై పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సే ఉంది. ఇకపోతే, పాజిటివ్ మౌత్ టాక్‌తో ఓటిటి వరకు స్టెడీగా కలెక్షన్లు కొనసాగించగలగటం కూడా సాధ్యమే.

చివరగా…

సినిమా ఓ ఎమోషన్. కానీ దేశం గుండెచప్పుడు వినిపించే వేళ, ఆ ఎమోషన్‌కు చిన్న బ్రేక్ అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో ప్రేక్షకుడి మనసు థ్రిల్లర్ కంటే రియల్ న్యూస్‌పైనే గట్టిగా ఉంది. మరి వాతావరణం త్వరగా మారితే, మళ్లీ బాక్సాఫీస్ బ్రైట్ అవుతుందా? వేచి చూడాల్సిందే.

, , ,
You may also like
Latest Posts from