సోషల్ మీడియాలో OG సినిమా ఫుల్‌గా ట్రెండింగ్‌లో ఉందని మీకు తెలుసు. ఇప్పుడు కొత్త హాట్ బజ్ – పవర్‌స్టార్ కుమారుడు అకీరా నందన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తాడని!

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్‌ యాక్షన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ముంబయిని కేంద్రంగా చేసుకుని తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది ఈ సినిమా.

టాక్ ఏంటంటే, సినిమాలో పవన్ కళ్యాణ్ యంగ్ వర్షన్‌గా అకీరా లేదా మెగా ఫ్యామ్ హీరోల్లో ఒకరు(సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటివారు) కనిపించే ఛాన్స్ ఉందంట. కానీ మాగ్జిమం అకీరా నే ఉండవచ్చు అని తెలుస్తోంది. అయితే ఆఫిషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు.

ఇక ఈ చిత్రానికి ఇప్పటివరకు పవన్‌ కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా భారీ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ₹135 కోట్లకు పైగా అమ్ముడైంది. అందులో నైజాంలో ₹50 కోట్లు, ఆంధ్రలో సుమారు ₹65 కోట్లు, సీడెడ్‌లో మరో ₹20 కోట్లు రాబట్టింది. ఇవన్నీ కలిపి ఇటీవలి కాలంలో అత్యంత పెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

ఇంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా తన బాక్సాఫీస్‌ బిజినెస్‌ను తగ్గించుకుని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావన రావడం తోనే ప్రీ-రిలీజ్‌ వసూళ్లు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ప్రబాస్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల స్థాయికి చేరాయి. ఇటీవల వీరి చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ₹130–150 కోట్ల మధ్య ప్రీ-రిలీజ్‌ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.

‘ఓజీ’పై ఉన్న ఈ భారీ క్రేజ్‌కు కారణం పవన్‌ స్టైలిష్‌ మాస్‌ లుక్‌, అలాగే దర్శకుడు సుజీత్‌ విజన్‌. సుజీత్‌ ఇంతకుముందు ప్రభాస్‌తో ‘సాహో’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో పవన్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే మంచి హైప్‌ ఏర్పడింది. ముఖ్యంగా దసరా సెలవులు ఈ సినిమాకు అదనపు లాభం చేకూర్చనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంటే OG లో అకీరా సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందా? లేక ఇది ఫ్యాన్ క్రియేటెడ్ హైప్ మాత్రమేనా?

, , , ,
You may also like
Latest Posts from