నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ , వర్క్ మీదే దృష్టి పెట్టింది. ఓ ప్రక్కన హెల్త్ ఇష్యూలను ఎదుర్కొంటూనే, జీవితాన్ని తనదైన శైలిలో గడుపుతోంది. ఇదిలా ఉంటే… గత కొంతకాలంగా సమంత – దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరూ అధికారికంగా ఏమీ ప్రకటించనప్పటికీ… తరచూ కలిసి కనిపించడమే ఈ వార్తలకు మరింత ఊపొస్తోంది.
బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు – ఈ ఏడాది ముగిసేలోపు ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించొచ్చని ప్రచారం జరుగుతోంది. అంటే ఇద్దరూ తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా చూస్తున్నారన్నమాట.
ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజ్ నీడిమోరు తన భార్యతో విడిపోయినట్టు చెబుతున్నారు. అప్పటి నుంచే సమంత – రాజ్ మధ్య ముడిపడిన అనుబంధం ప్రేమగా మారిందనే ప్రచారం ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2’ నుంచి మొదలైన వారి ప్రొఫెషనల్ ప్రయాణం… ఇప్పుడు వ్యక్తిగత బంధంగా మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే, సమంత ఇప్పటివరకు ఎలాంటి తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. కానీ తిరిగి టాలీవుడ్లో బలంగా రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె చూస్తోంది. ‘శుభం’ అనే చిన్న బడ్జెట్ సినిమాను సమంత స్వయంగా నిర్మించింది. ఇదే బాటలో పక్కా కాన్సెప్ట్ ఉన్న మరిన్ని సినిమాలను నిర్మించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తోంది.
అంతేకాదు… బాలీవుడ్లో రాజ్ & డీకేతో కలసి ఆమె చేస్తున్న ప్రాజెక్టులు, వారి మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.
ఇదే స్పీడులో ముందుకు వెళితే, సమంత – రాజ్ జంట నుంచి త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించారు. ఆయా ప్రాజెక్ట్‌లు చేస్తున్నప్పుడు రాజ్ – సమంత మధ్య పరిచయం ఏర్పడింది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌కు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే ఆ మధ్య సమంత కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె జిమ్‌లో వర్కౌట్లు, రాజ్‌తో కలిసి పికిల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించారు