
నయనతార రూల్ బ్రేక్? చిరంజీవి సినిమా కోసం ఇంత పెద్ద నిర్ణయమా?
సాధారణంగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్లే హైలైట్. కానీ ఒక హీరోయిన్ పేరు వినిపించగానే ఆ నియమాలన్నీ తలకిందులు అవుతాయి. ఆమె నయనతార. కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ టూర్స్ అన్నింటికీ స్పష్టంగా నో చెప్పే హీరోయిన్. అలాంటి నయనతార విషయంలో ఇప్పుడు టాలీవుడ్‌లో ఒకే ప్రశ్న తిరుగుతోంది. చిరంజీవి సినిమా కోసం ఆమె తన రూల్ బ్రేక్ చేయబోతుందా?
నయనతార ప్రమోషన్లకు దూరంగా ఉండడం కొత్త విషయం కాదు. గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. షూటింగ్ పూర్తి చేసి, సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా సైలెంట్‌గా ఉండడమే ఆమె స్టైల్. అలాంటి నయనతారను ఒప్పించడం అనిల్ రావిపూడికి కూడా పెద్ద సవాలే.
అయితే ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో ఆ ఛాలెంజ్ ని తొలిసారిగా బ్రేక్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోలో నయనతార ప్రత్యేకంగా షూట్ చేయడం అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా షూట్‌లో భాగంగా కాకుండా, కేవలం అధికారిక ప్రకటన కోసం ఆమె కెమెరా ముందు నిలబడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పుడు సినిమా సంక్రాంతి 2026కి విడుదల కానుండటంతో ప్రమోషన్ల ప్రాధాన్యం మరింత పెరిగింది. అనిల్ రావిపూడి సినిమాలంటే ఆగ్రెసివ్ ప్రమోషన్స్ తప్పనిసరి. లీడ్ క్యాస్ట్ మొత్తం ప్రచారంలో పాల్గొనడం ఆయన స్టైల్. ఈ నేపధ్యంలో నయనతార కూడా ప్రమోషన్స్‌లో భాగమవుతుందా అనే ఆసక్తి మరింత పెరిగింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ సమయంలోనే అనిల్ రావిపూడి నయనతారను ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడట. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
అది నిజమైతే, ఇది నయనతార కెరీర్‌లో ఒక కీలక మలుపే. చిరంజీవి సినిమా కోసం ఆమె తన కఠినమైన రూల్‌ను తొలిసారి పక్కన పెట్టడం అనే చర్చ బలంగా సాగుతోంది. జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు నయనతార ప్రమోషనల్ పార్టిసిపేషన్ నిజమైతే, సినిమాపై బజ్ మరింత పెరగడం ఖాయం.
ఇప్పుడు అందరి చూపూ ఒక్కదానిపైనే. నిజంగా నయనతార స్టేజ్ మీద కనిపిస్తుందా? లేక ఇదంతా ప్రీ రిలీజ్ హైప్‌లో భాగమా? ఆ సమాధానం సంక్రాంతి దగ్గర పడే కొద్దీ బయటపడనుంది.
