
‘హనుమాన్’ డైరక్టర్స్ పై ప్రొడ్యూసర్ల ప్రెజర్! ₹100 కోట్లు తిరిగివ్వాలా? !
‘హనుమాన్’తో నేషన్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారని టాలీవుడ్ గ్రేప్‌వైన్. టాప్ ప్రొడ్యూసర్లతో వరుసగా కమిట్‌మెంట్స్ తీసుకొని, వారికి అడ్వాన్స్ తీసుకున్న సంగతి బయటకు రావడంతో ఇండస్ట్రీలో టెన్షన్ పెరిగింది.
వార్తల ప్రకారం… ప్రశాంత్ వర్మ దాదాపు పది మంది ప్రొడ్యూసర్ల నుండి అడ్వాన్స్ తీసుకున్నారట. కొత్తవారు, చిన్న కంపెనీలు కూడా ఉన్న ఈ లిస్ట్‌లో మొత్తం అడ్వాన్స్ అమౌంట్ ₹80–₹100 కోట్ల వరకు వెళ్ళిందని టాక్!
డైరెక్ట్ చేయకుండా, స్టోరీ ఇవ్వడం, క్రియేటివ్ సూపర్విజన్ చేస్తానని ఆయన ఆఫర్ చేసినా…‘‘మాకు కావాల్సింది డైరెక్ట్ గానే మీ సినిమా’’ అంటూ ఎక్కువమంది రాజీ పడట్లేదట. అందుకే ఇప్పుడు ఆడ్వాన్సుల్ని తిరిగి ఇవ్వమని ప్రెజర్ పెంచుతున్నారట. ఒకవేళ సెటిల్‌మెంట్ రాకపోతే ఫిల్మ్ చాంబర్‌కి వెళ్లాలని కొందరు రెడీ అవుతున్నారని సమాచారం. ఇలా కొనసాగితే ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులు మొత్తం స్టక్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ చర్చలు.
ఇకపోతే…
బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో చేయాలనుకున్న సినిమా డ్రాప్ అయ్యింది
‘జై హనుమాన్’ భారీ డిలేలో పడింది
ప్రభాస్ సినిమా కనీసం మరో 2 ఏళ్లు స్టార్ట్ అవ్వదు
రణ్‌వీర్ సింగ్‌తో ఉండాల్సిన హిందీ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సల్
ఈ పరిస్థితుల్లో అడ్వాన్స్‌లను రీఫండ్ చేయడానికి ప్రశాంత్ వర్మ తన ఇన్వెస్ట్‌మెంట్స్, అసెట్స్ కూడా అమ్ముకునే ఆలోచనలో ఉన్నారట..అయితే ప్రశాంత్ వర్మ ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడతారు?
