
‘జైలర్’ డైరక్టర్ తో ఎన్టీఆర్…ఎప్పటి నుంచి?!
యంగ్ ప్రొడ్యూసర్ ఎస్. నాగ వంశీ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ‘జైలర్’తో సౌత్ అంతా షేక్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ను డైరెక్టర్‌గా లాక్ చేసి, మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. అసలు ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా, నెల్సన్ కూడా అప్పటికి ‘జైలర్ 2’ ను పూర్తి చేసి రిలీజ్ చేసి, ఎన్టీఆర్ సినిమా ప్రీ–ప్రొడక్షన్ మొదలుపెట్టాలని భావించాడు.
కానీ… గత కొన్ని నెలల్లో గేమ్ మొత్తం మారిపోయింది!
నీల్–ఎన్టీఆర్ సినిమా డిలే… త్రివిక్రమ్ నుంచి కొత్త బాంబ్ ప్రపోజల్!
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీ ఊహించిన దాని కంటే లేట్ అవుతోంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ ఓ భారీ మిథలాజికల్ డ్రామా ఐడియాతో ఎన్టీఆర్‌ను అప్రోచ్ కావటం ఇండస్ట్రీలో కొత్త రచ్చకు దారి తీసింది. దీంతో నెల్సన్ కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ అసలు క్లారిటీ లేకుండా పోయింది.
నెల్సన్ డైలెమా: ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తాడా? లేక మరో సినిమా చేసి వస్తాడా?
ఇటీవల ఈ కాంబినేషన్‌పై రెండు మూడు మీటింగ్స్ జరిగినా… నెల్సన్ ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదట. ఎన్టీఆర్ డేట్స్ కోసం బ్రేక్ తీసుకుని వెయిట్ చేయాలా? లేక మధ్యలో ఇంకో సినిమా చేసి క్లియర్‌గా వస్తానా? అన్నది ఆయన ఇంకా డిసైడ్ చేయలేదని టాక్.
ఫైనల్‌గా?
నెల్సన్ ‘జైలర్ 2’ నుంచి ఫ్రీ అయిన తర్వాతే అసలు డిసిషన్ తీసుకోనున్నాడట. అంటే… ఎన్టీఆర్–నెల్సన్ మూవీ స్టార్ట్ అయ్యే టైమ్‌లైన్ ప్రస్తుతం టోటల్‌గా అనిశ్చితంలో ఉంది.
