ఇండో-పాక్ సంబంధాలు ఎప్పుడూ చీకటి మేఘాలా ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం జరగబోతోందా అనే భయం, సరిహద్దుల వద్ద ఉత్కంఠ మగ్గడం ఇదే ప్రజల సాధారణ పరిస్థితి గా మారింది. అలాంటి నేపథ్యంలో, బాలీవుడ్ ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైపోయాయి.

ముంబైలో ‘నరకాత్ స్వర్గ్’ అనే పుస్తకావిష్కరణలో పాల్గొన్న జావేద్ అక్తర్ పాకిస్థాన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన మాటలు ఎంతో సంచలనంగా, వాదనలకు ఆహ్వానం ఇస్తున్నాయి.

‘‘నేను నాస్తికుడినని అందరూ నరకానికి వెళతానని చెబుతారు. మరికొందరు అంటున్నారు నేను జిహాదీగా పాకిస్థాన్‌కు వెళ్ళతానని. ఒక సందర్భంలో పాకిస్థాన్‌కు వెళ్ళాలా లేక నరకానికా? అనే పరిస్థితి వస్తే, నేను నరకాన్నే ఎంచుకుంటా’’ అని జావేద్ అక్తర్ ప్రకటించారు.

అయితే ఈ స్పష్టమైన అభిప్రాయంతో ఆయన పలు సందర్భాల్లో ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, తన నిజాయితీతో మాట్లాడటం ఆయన ధైర్యంగా నిలబడటానికి సాక్ష్యం.

You may also like
Latest Posts from