ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరిగేట్టు అనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లోకి వచ్చేశాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.ఎన్టీఆర్ మీద లెంగ్తీ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. త్వరగా ఈ మూవీని ఫినిష్ చేసి మళ్లీ నెల్సన్ ప్రాజెక్టుని ఎన్టీఆర్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుందనేది హాట్ టాపి టాపిక్ గా మారింది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
డ్రాగన్ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసారు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అలాగే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో నిమగ్నమై ఉండటంతో తారక్ రాక కోసం టీమ్ ఎదురుచూడాల్సి వచ్చింది.
And finally welcome to #NTRNeel soil 💣💥@tarak9999 @NTRNeelFilm pic.twitter.com/E9xuPGUfnp
— Prashanth Neel – The Director (@NeelOfficialFc) February 20, 2025
సంక్రాంతి 2026 దాదాపు అసాధ్యం, మేకర్స్ ఇప్పుడు డ్రాగన్‌ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 8, 2026న ఈ చిత్రం విడుదల తేదీగా పరిగణించబడుతుంది మరియు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Two MASS ENGINES ready to wreck it all from tomorrow 💥💥#NTRNeel will shake the shorelines of Indian cinema 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries @tseriessouth pic.twitter.com/psHgfYWuF1
2025 జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయ్యింది. కానీ, ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ఆగమనంతో.. షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లనుంది.