ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి చెందిన చిన్న అప్డేట్ వచ్చిన చాలనేలా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

‘ఎన్టీఆర్.. నీల్’ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ అవుతారనే విషయాన్ని అధికారికంగా మైత్రి మేకర్స్ వెల్లడించారు.

“మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ అత్యంత విస్ఫోటన దశలోకి ప్రవేశిస్తోంది. ఏప్రిల్ 22 నుండి విధ్వంసకర నేలపైకి ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు” అని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రేజీ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది.

ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2025 జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయ్యింది.

కానీ, ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ఆగమనంతో.. షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లనుంది.

,
You may also like
Latest Posts from